Begin typing your search above and press return to search.

శ్రీదేవి సెంటిమెంట్ కొనసాగిస్తోందే!

By:  Tupaki Desk   |   19 Oct 2019 10:31 AM GMT
శ్రీదేవి సెంటిమెంట్ కొనసాగిస్తోందే!
X
బాలీవుడ్లో న్యూ జెనరేషన్ స్టార్ కిడ్స్ చాలామందే ఉన్నారు కానీ అందరిలో క్రేజ్ ఎక్కువ ఉండేది మాత్రం జాన్వి కపూర్ కే. చేసింది ఒక్క సినిమానే అయినా యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. జాన్వి ఫ్యాషన్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా జాన్వి జిమ్ము డ్రెస్సులకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జాన్వి ఎప్పుడు బైటకు వచ్చ్చినా అందరి దృష్టి జాన్వి డ్రెస్సులపైనే ఉంటుంది కానీ రీసెంట్ గా మరొకటి కూడా అందరి దృష్టిని ఆకరించింది. అదే జాన్వి కొత్త కారు.

ఈమధ్య జాన్వి మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. లగ్జరీ కారు కదా.. సూపర్ క్యూట్ గా ఉంది.. ఆ కారెక్కి రయ్యిరయ్యిమని ముంబైలో చక్కర్లుకొడుతోందట. అయితే ఈ కారుకు మరో స్పెషల్ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే కారు నంబర్. ఈ కారు నెంబర్ MH 02 FG 7666. జాన్వి అమ్మగారు శ్రీదేవి అప్పట్లో 7666 నంబర్ ఉన్న కారునే వాడేవారట. అందుకే జాన్వి పట్టుబట్టి మరీ ఆ నంబర్ ను ఎంచుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుందట. శ్రీదేవి కారు బ్రాండ్ కూడా మెర్సిడెస్ బెంజేనట. కానీ కలర్ మాత్రం డిఫరెంట్. ఆవిడ వైట్ కలర్ కారు వాడేవారట.

జాన్వి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయట.