Begin typing your search above and press return to search.
డ్యాన్స్ ని బ్యాలెన్స్ చేయడమెలా జాన్వీ?
By: Tupaki Desk | 25 Feb 2020 4:53 PM GMTబ్యాలెన్స్ యోగా తరహాలోనే బ్యాలెన్సింగ్ డ్యాన్స్ అనేది ఒక ఆర్ట్. ఇదిగో ఇక్కడ చక్కనమ్మ అందులోనే శిక్షణ పొందుతోంది. డ్యాన్స్ ఎవరైనా చేస్తారు.. ఎంత వేగంగా అయినా చేయగలుగుతారు కానీ.. బ్యాలెన్స్ చేయడం అన్నదే టిఫికల్. కానీ జాన్వీ కపూర్ సాధనతో ఆ బ్యాలెన్స్ విద్యను ఇట్టే పట్టేస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోని తాజాగా ఇలా సామాజిక మాధ్యమాల్లో అభిమానుల ముందుకు వచ్చింది.
వీడియో ఆద్యంతం అద్భుతమైన నృత్య విన్యాసాలతో జాన్వీ కట్టి పడేస్తోంది. ఇంతకీ ఈ ప్రాక్టీస్ దేనికోసమో! అంటే తఖ్త్ లాంటి భారీ హిస్టారికల్ చిత్రంలో నృత్యకారిణిగా కనిపిస్తున్నందుకేనా అన్నది జాన్వీనే చెప్పాలి. ఇక ఈ వీడియోలో లిరిక్ అంతే ఆకట్టుకుంటోంది. గైడ్ సినిమాలోని `పియా తోసే నైనా లాగిరే` అంటూ సాగే గీతం ఇది. ఈ క్లాసిక్ సాంగ్ కి జాన్వీ వయ్యారాలు పోతూ.. పాదం కదిపిన తీరు ఆకట్టుకుంది.
జాన్వీ ప్రస్తుతం తఖ్త్- గుంజాన్ సక్సేనా- రూహీ అఫ్జానా- దోస్తానా 2 చిత్రాలతో బిజీగా ఉంది. తఖ్త్ చిత్రంలో జాన్వీ పాత్ర ఎంతో ఛాలెంజింగ్ అని తెలుస్తోంది. కరణ్ జోహార్ మార్గదర్శనంలో జాన్వీ రోజురోజుకి షైన్ అవుతున్న తీరు ఆసక్తికరం.