Begin typing your search above and press return to search.

అంజలి ప్రేమకథ ముగిసిందా?

By:  Tupaki Desk   |   18 Jun 2018 7:24 AM GMT
అంజలి ప్రేమకథ ముగిసిందా?
X
తెలుగమ్మాయి అయిన అంజలి.. తమిళంలో కథానాయికగా మంచి పేరు సంపాదించి అక్కడ మంచి స్థాయికి వెళ్లింది. అక్కడి ప్రేక్షకులు అంజలిని బాగా ఓన్ చేసుకున్నారు. ఐతే కొంత కాలం పాటు ఆమె కెరీర్ బాగానే సాగింది కానీ.. మధ్యలో ఓ వ్యక్తిగత వివాదం కారణంగా కెరీర్ గాడి తప్పింది. ఆ సమయంలో తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టిన అంజలి.. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ తమిళంలో బిజీ అయింది. కానీ వరుస ఫెయిల్యూర్లు ఆమెను వెనక్కి లాగేశాయి. ఇలాంటి టైంలోనే హీరో జైతో ఆమె ప్రేమాయణం మొదలుపెట్టింది. ఇద్దరూ ఒక ఫ్లాట్లో కొంత కాలం పాటు సహజీవనం కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. తమ ప్రేమను బహిరంగపరచడానికి కూడా వాళ్లిద్దరూ వెనుకాడలేదు. దీంతో ఇక వీరి పెళ్లే తరువాయి అనుకున్నారంతా.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. జై-అంజలి విడిపోయినట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా వీళ్లిద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడట్లేదు. తాజాగా అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియాలో సెలబ్రెటీలు చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. కానీ జై పత్తా లేడు. అతనెక్కడా అంజలి ప్రస్తావన తేలేదు. పోయినేడాది అంజలి మీద అదే రోజు ఎంతో ప్రేమ కురిపించాడతను. జైతో పెళ్లికి రెడీ అయిన సమయంలో తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా అంజలి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఆలోచన మారింది. ఇక్కడ ‘గీతాంజలి’ సీక్వెల్ చేయడానికి అంగీరించింది కూడా జై నుంచి విడిపోయాకే అంటున్నారు. మరి అంతగా ప్రేమించుకున్న జంట ఇలా ఎందుకు విడిపోయిందో ఏమో?