Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత‌తో తెలుగ‌మ్మాయి గొడ‌వ చ‌ల్లార‌లేదా?

By:  Tupaki Desk   |   4 April 2020 3:45 AM GMT
ఆ నిర్మాత‌తో తెలుగ‌మ్మాయి గొడ‌వ చ‌ల్లార‌లేదా?
X
తెలుగమ్మాయి అంజ‌లి ల‌వ్ స్టోరి గురించి తెలిసిందే. తెలుగింటి సీత‌మ్మ‌-యువ తంబీ హీరో జై మ‌ధ్య ప్రేమాయ‌ణం గురించి గ‌డిచిన కొన్నేళ్లుగా వేడెక్కించే క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ కాంబినేష‌న్ లో వ‌రుస‌గా సినిమాలు తెర‌కెక్క‌డంతో ఆ స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని అటుపై క‌లిసే జీవిస్తున్నార‌ని ప్ర‌చార‌మై పోయింది. ఇక ఈ జంట‌తో సినిమా తీసిన ఓ నిర్మాతే ఏకంగా వాళ్లిద్ద‌రి చాటు మాటు వ్య‌వ‌హారాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసాడు. నిర్మాత కళ్లు క‌ప్పి సెట్స్ నుంచి ఎస్కేప్ అయ్యార‌ని.. చెట్టా ప‌ట్టాలేసుకుని తిరిగార‌ని.. ఒకే రూమ్ లో గ‌డిపార‌ని..అలా షూటింగ్ డుమ్మా కొట్ట‌డం కార‌ణంగా ల‌క్ష‌ల రూపాయాలు న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని ప‌బ్లిక్ గానే ఓపెన్ అయ్యాడు. అంత‌కు ముందు ప్రేమ నిజ‌మే..పెళ్లి చేసుకోవ‌డం ఖాయ‌మేననే బ‌ల‌మైన క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయార‌ని కూడా అంతే జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే ఏనాడు దీనిపై అంజ‌లి స్పందించింది లేదు. జై సైతం మౌనంగా ఉండ‌టంతో ఈ ప్ర‌చార‌మంతా నిజ‌మేన‌ని కోలీవుడ్ మీడియా లో బ‌ల‌మైన క‌థ‌నాలు అంత‌కంత‌కు హీట్ పెంచాయి.

తాజాగా ఓ పాత్రికేయుడు సూటిగా అంజ‌లిని మీది ల‌వ్ ఫెయిల్యూర్ అని విన్నాం అంటూ అమ్మ‌డిని ప్ర‌శ్నించాడు. దీంతో అంజ‌లి సైతం అంతే వేగంగా త‌డ‌బ‌డ‌కుండా స‌మాధానం ఇచ్చింది. ``నాది ల‌వ్ ఫెయిల్యూర్ కాదు. అస‌లు నేను ప్రేమ‌లోనే ప‌డ‌లేదు. జై మంచి స్నేహితుడు మాత్ర‌మే. ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్న‌ట్లు గానీ..పెళ్లి చేసుకుంటున్న‌ట్లు గానీ ఎక్క‌డా ఎవ‌రితోనూ చెప్ప‌లేదే! మా మ‌ధ్య ఏదో రిలేష‌న్ ఉంద‌ని...పెళ్లి చేసుకుంటున్నామ‌ని...విడిపోయామ‌ని మీడియా ఊహ‌గానాలు త‌ప్ప అంత సీన్ లేదు. అయినా ఒక హీరోతో క‌లిసి రెండు.. మూడు సినిమాలు చేస్తే ప్రేమ‌లో ప‌డిపోతామా?`` అంటూ ఆన్స‌ర్ ఇవ్వ‌డ‌మే గాక‌ ఎదురు ప్ర‌శ్నించింది. మా మ‌ధ్య స్నేహం చూసి కోలీవుడ్ లో మీరు అనుకుంటోన్న ఓ నిర్మాత మీలాగానే అనుకుని ఉండొచ్చు.. అంటూ రివ‌ర్స్ పంచ్ విసిరింది.

ఆ నిర్మాత‌పై అంజ‌లి త‌న‌దైన శైలిలో స్పందించింది. ``మాది ఎఫైర్ అనేది ఆయ‌న అభిప్రాయం కావొచ్చు. కానీ దానిని నేను ఖండించ‌ను. ఆయ‌న ఎలా అనుకున్నా ప‌ర్వాలేదు. మాది స్నేహం.. అంత‌కు మించి మ‌రే ఇత‌ర‌ బంధం లేదు`` అని అంది. అయితే స‌ద‌రు నిర్మాత అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్యలు నిజ‌మేన‌ని అవి ఆరోప‌ణ‌లు కానే కాద‌ని...ఇద్దరూ ర‌హ‌స్యంగా ఒకే రూమ్ లో గ‌డ‌ప‌డం నిజ‌మేన‌ని అంజ‌లి వ్యాఖ్య‌ల‌ను బ్ట‌టి మ‌రోసారి కోలీవుడ్ మీడియాలో టీజింగ్ చేసే క‌థ‌నాలు మ‌ళ్లీ ఊపందుకున్నాయి.