Begin typing your search above and press return to search.

రామ్ సినిమాలో జై బాలయ్య

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 AM GMT
రామ్ సినిమాలో జై బాలయ్య
X
రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కథలను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన రెడ్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ రామ్ తన తదుపరి ప్రాజెక్టుల విష తెరకెక్కుయంలో మాత్రం చాలా హై లోనే ఆలోచిస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న ఆ సినిమా పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

అయితే బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించినున్నారు. అయితే ఆ కథలో ఒక ఎపిసోడ్ లో రామ్ నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట.

జై బాలయ్య అనే స్లోగన్ కూడా ఉంటుందట. ప్రస్తుతం యూత్ ఎలాగైతే జై బాలయ్య అంటూ ఉంటారో అలాగే సినిమాలో రామ్ కూడా ఒక ఎపిసోడ్ మొత్తంలో జై బాలయ్య ట్యాగ్ ను హైలెట్ చేస్తాడని తెలుస్తోంది.

ఇక బాలయ్య సినిమాలోని ఒక రిఫరెన్స్ ని కూడా బోయపాటి సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. రామ్ కూడా ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. ఇదే నిజమైతే నందమూరి అభిమానులకి మంచి కిక్ ఇచ్చినట్లే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక హీరోయిన్ దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.

అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అని పరిణితి చోప్రాను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఎప్పటినుంచో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేయాలని చూస్తోంది.

కానీ ఆమెకు సరైన అవకాశాలు దొరకలేదు. ఇక ఫైనల్ గా బోయపాటి ఆమెను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును మరికొన్ని నెలల్లో మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.