Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ నోట 'జై బాలయ్య' మాట

By:  Tupaki Desk   |   30 Dec 2018 11:15 AM GMT
ఎన్టీఆర్‌ నోట జై బాలయ్య మాట
X
నందమూరి ఫ్యాన్స్‌ అంతా కోరుకుంటున్నట్లుగానే ఆ ఫ్యామిలీ హీరోలు కలిసి పోయారు. చాలా కాలంగా విభేదిస్తూ వస్తున్న బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌ లు హరికృష్ణ మరణం తదనంతరం కార్యక్రమాల తర్వాత కలిసి పోయారు. హరికృష్ణ మరణం ఫ్యామిలీలో ఉన్న గొడవలు తొలగిపోయాయి. ఆమద్య ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో బాలయ్య పాల్గొనగా, తాజాగా జరిగిన ‘ఎన్టీఆర్‌’ ఆడియో విడుదల కార్యక్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపించి అలరించాడు.

నందమూరి హీరోలు కలిసి పోయిన నేపథ్యంలో పలు సందర్బాల్లో - పదే పదే కలుస్తూనే వస్తున్నారు. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం రాజస్థాన్‌ లోని జైపూర్‌ కోటలో జరిగిన విషయం తెల్సిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్‌ తో పాటు ఎంతో మంది స్పెషల్‌ గెస్ట్‌ లు పాల్గొన్నారు. కార్తికేయ పెళ్లి సంగీత్‌ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మరియు ఇతర స్టార్స్‌ ఎంజాయ్‌ చేశారు. ఆ సందర్బంగా తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

ఆ వీడియోలో ఎన్టీఆర్‌ తో పాటు మరి కొందరు జై బాలయ్య అంటూ గట్టిగా నినదిస్తు సరదాగా పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎందుకు జై బాలయ్య అంటూ గట్టిగా అరిచారు అనే విషయం క్లారిటీ లేదు కాని, నందమూరి ఫ్యాన్స్‌ మాత్రం చాలా సంతోషంగా ఆ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ నోట జై బాలయ్య అనే పదం, అది కూడా కార్తికేయ పెళ్లి వేడుకలో రావడంతో చాలా స్పెషల్‌ అంటున్నారు.