Begin typing your search above and press return to search.
జై భీమ్ డైరెక్టర్.. ఇలాంటి ప్రాజెక్ట్ ఊహించలేదు!
By: Tupaki Desk | 26 July 2022 5:17 AM GMTసూర్య కథానాయకుడుగా నటించిన జై భీమ్ సినిమా ఎలాంటి గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో హీరో సూర్య నటించిన విధానం అలాగే డైరెక్టర్ మేకింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆలోచింపజేసింది. ఒక విధంగా ఈ సినిమా కొన్ని వివాదాలను టచ్ చేసినప్పటికీ కూడా ఫైనల్ గా అతను చెప్పిన పాయింట్ అయితే చాలా బలంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
డైరెక్టర్ టీజీ జ్ఞాన్ వేల్ ఆ సినిమా తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోనే అగ్ర నిర్మాతలు నుంచి చాలా ఆఫర్లు అందుకున్నాడు. అయితే అతను మాత్రం తొందరపడకుండా తదుపరి సినిమాను కూడా చాలా ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా తమిళ్ దర్శకులు రెండవ సినిమాను చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకురావాలని అనుకుంటారు.
కానీ జై భీమ్ దర్శకుడు మాత్రం ఆ విధంగా కాకుండా మళ్ళీ రెండవ సినిమాలో కూడా ఏదైనా కొత్త పాయింట్ను తక్కువ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఎక్కువ ఇంపాక్ట్ చూపించాలని అనుకుంటున్నాడు. అనవసరంగా హడావిడి చేయకుండా చేస్తేనే జై భీమ్ లాంటి రిజల్టు వస్తుంది అని ఈ దర్శకుడికి బాగా అర్థమైనట్లు ఉంది. అందుకే దోశ కింగ్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ టైటిల్ వినగానే ఏదైనా కామెడీ సినిమా చేస్తున్నారా అనే సందేహాలు కూడా కలిగాయి. కానీ సినిమా కథ అలాంటిది కాదట. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. దర్శకుడు మాత్రం ఆ కథతో ఏకంగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నాడు.
2001లో జీవనజ్యోతి అనే అమ్మాయి భర్తను హత్య చేసినట్లుగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంది. ఇక శరవణ భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకుడు పి. రాజగోపాల్‌పై ఆమె న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ కథలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని దర్శకుడు వాటన్నిటికీ పై ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నటీనటులకు సంబంధించిన విషయాలను అలాగే టెక్నీషియన్స్ గురించి కూడా పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇక త్వరలోనే ఆ విషయాలు తెలుస్తాయని దర్శకుడు వివరణ ఇచ్చాడు.