Begin typing your search above and press return to search.
'జై భీమ్' ఫస్ట్ లుక్: గిరిజనుల హక్కుల కోసం పోరాడే లాయర్ గా సూర్య..!
By: Tupaki Desk | 23 July 2021 1:16 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య.. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరోజు(జులై 23) తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన #Suriya40 ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో తాజాగా '#Suriya39' చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ప్రకటించడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
'కుత్తట్టిల్ ఓరుదన్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ''జై భీమ్'' అనే టైటిల్ ని ఖరారు చేశారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో లాయర్ గెటప్ లో సూర్య కనిపిస్తున్నారు. అలానే కొందరు గిరిజన తెగలకు చెందిన ప్రజలు కూడా ఈ పోస్టర్ లో ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు మీదుగా 'జై భీమ్' అంటూ టైటిల్ పెట్టడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
'జై భీమ్' చిత్రంలో గిరిజన తెగల హక్కులు మరియు వారి సమస్యలపై పోరాడే పవర్ ఫుల్ అడ్వకేట్ గా సూర్య నటిస్తున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో తన కెరీర్ లోనే మొదటిసారి నల్లకోటు ధరిస్తున్నారు. ఈ చిత్రంలో 'కర్ణన్' ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నారు.
తెలుగు తమిళ మలయాళ కన్నడ వంటి నాలుగు భాషల్లో 'జై భీమ్' సినిమా రూపొందుతోంది. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ ఆర్ కాథిర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. విభిన్నమైన స్టోరీలు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటున్న సూర్య.. 'జై భీమ్' చిత్రంతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.