Begin typing your search above and press return to search.
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు 'జై భీమ్'..!
By: Tupaki Desk | 19 Jan 2022 4:31 PM GMTతమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ''జై భీమ్''. టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలై అశేష ప్రేక్షకాదరణ అందుకుంది. ఇది సూర్య కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఓ మైలురాయి చిత్రమని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.
జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా 'జై భీమ్' సినిమా రూపొందింది. భారతదేశంలోని సామాజిక అసమానతలు - కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజనులు, అణగారిన వర్గాలు - ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై అన్యాయంగా కొందరు పోలీసులు చేసే దుశ్చర్యలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన 'జై భీమ్' చిత్రం గురించి ఇటీవల ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో కొనియాడారు. అలానే సినిమా రేటింగ్ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ క్రమంలో 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు సూర్య సినిమా అధికారికంగా ఎంపిక కాబడింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా, 'జై భీమ్' చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య - జ్యోతిక నిర్మించారు. ఇందులో సూర్య తో పాటుగా మణికందన్ - లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - రజిషా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎస్ ఆర్ కాథిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ''జై భీమ్'' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.