Begin typing your search above and press return to search.
జై భీమ్- మరక్కర్ ఆస్కార్స్ బరిలోకి?
By: Tupaki Desk | 21 Jan 2022 10:33 AM GMTసూర్య-నటించిన అత్యంత వివాదాస్పద చిత్రం `జై భీమ్` .. మోహన్ లాల్ నటించిన భారీ-బడ్జెట్ పీరియాడికల్ డ్రామా `మరక్కర్ అరబికడలింటే సింహ` (మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ) ఆస్కార్ 2022లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ జాబితాకు అధికారికంగా నామినేట్ చేయబడిన భారతీయ సినిమాలు.
ఈ రెండు సినిమాలు 274 చలనచిత్రాలతో పాటు ఆస్కార్ లో చోటు దక్కించుకున్నందుకు భారతీయ సినీ ప్రేమికులు గర్వపడుతున్నారు. ఈ ఏడాది మంచి జరగాలని ఆయా తారల అభిమానులు ఆశిస్తున్నారు.
ఆస్కార్ నామినేషన్‌లు జనవరి 27న ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగుస్తాయి. ఫైనల్ నామినేషన్ లు 8 ఫిబ్రవరి 2022న వెల్లడిస్తారు.
94వ అకాడమీ అవార్డుల వేడుక మార్చి 27న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఈ వేడుకల్లో సౌత్ సినిమా మెరుపులు మెరిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. జైభీమ్ లో సంచార జీవుల గిరిజనుల జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపించడమే గాక.. నాటి రోజుల్లో పోలీసుల దౌర్జన్యాలను ప్రజల దుస్థితిని కూడా తెరపై అద్భుతంగా రక్తి కట్టించారు. వెనకబడిన జాతులకు అండగా నిలిచే యువలాయర్ పాత్రలో సూర్య అసమాన నట ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. ఇకపోతే మోహన్ లాల్ మరక్కార్ హిస్టారికల్ కాన్సెప్టుతో వచ్చిన సినిమా. లాల్ నటన స్టార్ డమ్ ప్రధాన ఆయుధాలుగా కనిపించాయి.