Begin typing your search above and press return to search.

మన సినిమా వరల్డ్ నెం.1

By:  Tupaki Desk   |   19 Nov 2021 5:56 AM GMT
మన సినిమా వరల్డ్ నెం.1
X
ప్రపంచ వ్యాప్తంగా సినిమాల రేటింగ్ విషయంలో IMDb ని ప్రామాణికంగా తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. వ్యూవర్స్ రేటింగ్‌ ను అందులో ప్రదర్శించడం జరుగుతోంది. అందులో 8 రేటింగ్‌ వచ్చిందంటే అద్బుత సినిమా గా గుర్తిస్తారు. అలాంటిది 9 రేటింగ్ దాటడం అంటే చాలా చాలా అరుదుగా జరుగుతుంది.

అతి కొద్ది హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఆ ఘనత దక్కింది. ఇప్పుడు మన ఇండియన్ సినిమా.. మన సౌత్‌ సినిమా అయిన జై భీమ్ కు IMDb లో భారీ రేటింగ్ దక్కింది. ఇప్పటి వరకు టాప్ లో ఉన్న సినిమాలన్నింటిని కూడా పక్కకు నెట్టి నెం.1 స్థానంలో నిలిచింది. IMDb లో సూర్య నటించిన జై భీమ్‌ కు గాను వ్యూవర్స్‌ ఏకంగా 9.6/10.0 రేటింగ్ ఇవ్వడం జరిగింది.

హాలీవుడ్‌ గాడ్‌ ఫాదర్‌ సినిమాతో పాటు మరి కొన్ని క్లాసిక్‌ సినిమాలను కూడా జై భీమ్ పక్కకు నెట్టింది. అద్బుతమై సినిమాగా రివ్యూలు దక్కించుకున్న ఈ సినిమా ముందు ముందు మరింతగా మంచి రేటింగ్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను సూర్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు గాను IMDb లో 73 వేల మంది ఓట్ల ద్వారా తమ రేటింగ్ ను ఇవ్వడం జరిగింది. ఈ సంఖ్య పెరిగినా కొద్ది సాదారణంగా రేటింగ్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. కాని సూర్య సినిమా జై భీమ్ కు మాత్రం ఖచ్చితంగా రేటింగ్‌ పెరుగుతుంది కాని తగ్గదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసియులను అప్పట్లో పోలీసులు ఎలా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టే వారు.. కేసులు ఒప్పుకోకుంటే వారు ఎలాంటి చర్యలకు పాల్పడే వారు అనేది సినిమాలో చూపించడం జరిగింది. అత్యంత హృదయ విదారకమైన సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మరో వైపు ఈ సినిమా లో సినతలి పాత్రలో నటించిన నటి మరియు సూర్యలు అద్బుత నటనతో మెప్పించారు.

వారిద్దరికి కూడా అవార్డులు రావాల్సిందే అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. జై భీమ్‌ కు ప్రశంసలు మాత్రమే కాకుండా విమర్శలు కూడా ఉన్నాయి. కొందరికి జరిగిన అన్యాయంను చూపించేందుకు మరో సామాజిక వర్గంను కించ పర్చడం జరిగిందంటూ జై భీమ్‌ సినిమాపై తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. 5 కోట్ల నష్టపరిహారం దావాను కూడా ఆ సామాజిక వర్గం వారు కోర్టులో వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ విషయమై విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.