Begin typing your search above and press return to search.
'జై భీమ్' కొత్తగా హిందూ క్రిస్టియన్ వివాదం
By: Tupaki Desk | 19 Nov 2021 8:33 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ ఇటీవలే అమెజాన్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను దక్కించుకుంది. సూర్య చేసిన మరో మంచి ప్రయత్నం అంటూ విమర్శకుల ప్రశంసలు కురిపించారు. సినిమా మొత్తం కూడా ఒక సామాజిక వర్గం వారు కొన్నాళ్ల క్రితం ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. వారికి న్యాయం అనేది ఎంత దూరంగా ఉండేది అనేది చూపించే ప్రయత్నం చేశారు.
జాతీయ అవార్డుకు అర్హం అయిన సినిమా అనడంలో సందేహం లేదు. సినిమా లో హీరో సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సినతల్లి పాత్రలో నటించిన అమ్మాయికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అన్నట్లుగా సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ సినిమా ప్రశంసలతో పాటు కొన్ని వర్గాల వారి విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.
ఇప్పటికే ఆదివాసియులను ఈ సినిమాలో హింసించే పోలీసును మా సామాజిక వర్గంకు చెందిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారని.. మా సామాజిక వర్గం సింబల్ ను ఉపయోగించడం ద్వారా మీరు మమ్ములను అవమానించారంటూ చిత్ర యూనిట్ సభ్యులపై ఏకంగా 5 కోట్ల నష్టపరిహారం దావా వేయడం జరిగింది.
ఈ వ్యవహారం చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మరియు జనాలు సూర్య అండ్ టీమ్ కు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ప్రతి చిన్న విషాయాలకు వివాదాలను క్రియేట్ చేయడం అనేది ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంట్ అంటూ వారు ఆరోపిస్తున్నారు.
మంచి సినిమా గా జై భీమ్ ను ఆధరించి.. అభినందించాల్సింది పోయి ఏదో ఒక వివాదంను పుట్టించడం ఏంటీ అంటూ సూర్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మరో కొత్త వివాదం రాజుకుంటుంది.
ఈ సినిమాలో పాత్రల పేర్లను ఎక్కువగా యదార్థ సంఘటనలకు సంబంధించినవే పెట్టారు. హీరో పాత్రకు రియల్ గా ఉన్న చంద్రు పేరును పెట్టడం జరిగింది. ఇక ఇతరుల పేర్లను కూడా ఉన్నది ఉన్నట్లుగానే పెట్టారు. కాని పోలీసు స్టేషన్ లో ఆదివాసీలను వేదించే పోలీసు పాత్రకు సినిమా లో గురుమూర్తి అని పేరు పెట్టారు.
కాని అసలు పోలీసు ఆఫీసర్ పేరు మాత్రం ఆంటోనీ సామీ. క్రిస్టియన్ అయిన ఆంటోనీ సామీ అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. విచారణ ఎదుర్కొన్నాడు. అతడి పేరును ఎందుకు పెట్టలేదు అనేది మొదటి నుండి చర్చ జరుగుతుంది.
ఇప్పుడు మాత్రం క్రిస్టియన్ వారిని అవమానించినట్లుగా అవుతుందనే ఉద్దేశ్యంతో గురుమూర్తి పేరు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీశావు అంటూ సూర్యను కొందరు విమర్శిస్తున్నారు. హిందూవులు మరియు క్రిస్టియన్స్ ప్రస్తుతం ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. గురు మూర్తి అని కాకుండా క్రిస్టియన్ పేరునే మరేదైనా పెట్టి ఉంటే గొడవ ఉండేది కాదు. సూర్య మరో పెద్ద వివాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో చూడాలి.