Begin typing your search above and press return to search.
'జై భీమ్' టీజర్: అణగారిన వర్గాల తరపున పోరాడే లాయర్ కథ..!
By: Tupaki Desk | 15 Oct 2021 1:41 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ''జై భీమ్''. 'కుత్తట్టిల్ ఓరుదన్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య ఒక లాయర్ గా కనిపిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరునే టైటిల్ గా పెట్టడంతో అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షించింది. దసరా కానుకగా ఈరోజు సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
'జై భీమ్' టీజర్ చూస్తుంటే.. ఇది అన్యాయానికి గురైన షెడ్యూల్ తెగల తరపున నిలబడిన పవర్ ఫుల్ అడ్వకేట్ కథ అని తెలుస్తోంది. షెడ్యూల్ ట్రైబ్ కు చెందిన కొందరు అమాయకులను పోలీసులు ఇబ్బందులకు గురి చేయగా.. న్యాయం కోసం లాయర్ అయిన సూర్య ను ఆశ్రయించినట్లు చూపించారు. ఈ క్రమంలో ఏ ఆధారం లేకుండానే ముగ్గురు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసినట్లు తెలుస్తోంది. ఇందులో పోలీసుల తరపున వాదించే లాయర్ గా రావు రమేష్ కనిపిస్తున్నారు.
ఇందులో 'కర్ణన్' ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్ గా నటించగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - మణికందన్ - లిజో మోల్ జోస్ కీలకమైన పాత్రలలో కనిపించారు. భాదింపబడ్డవారికి లభించని న్యాయం.. వాళ్ళకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది' అనే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. సూర్య మొదటిసారి నల్లకోటు ధరించిన ఈ సినిమా టీజర్ విశేషంగా అలరిస్తోంది. అణచివేతకు గురైన అమాయక ప్రజల హక్కుల కోసం న్యాయవాది ఎలా పోరాడారు? వారి జీవితాలకు భరోసా కలిగించేలా న్యాయం జరిగిందా లేదా? అనేది తెలియాలంటే 'జై భీమ్' సినిమా చూడాల్సిందే.
2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య - జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ విధానంలో 'జై భీమ్' సినిమా విడుదల అవుతుంది. దీపావళి కానుకగా నవంబర్ 2న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ పెడుతున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ వంటి నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
'జై భీమ్' చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ ఆర్ కాథిర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'కేజీయఫ్' ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు-అరివ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. 'ఆకాశం నీ హద్దురా' తర్వాత సూర్య నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటుందో చూడాలి.