Begin typing your search above and press return to search.

బుల్లితెరపై రావణ విశ్వరూపం

By:  Tupaki Desk   |   4 Jan 2018 6:17 AM GMT
బుల్లితెరపై రావణ విశ్వరూపం
X
జై లవకుశతో తనలో నెగటివ్ షేడ్ చూపించే మరో యాంగిల్ ఉందని విజయవంతంగా రుజువు చేసిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఆ సినిమాతో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. సంక్రాంతికి జెమిని టీవీ లో జై లవకుశ వరల్డ్ ప్రీమియర్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ మధ్య సినిమాలు థియేటర్ లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ - టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడం చూస్తూనే ఉన్నాం. రాజు గారి గది 2 - రాజా ది గ్రేట్ - జవాన్ టీవీలో రాకముందే అమెజాన్ ప్రైమ్ లో హెచ్ డి క్వాలిటీతో విడుదలై కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాయి. అందుకే మరీ ఆలస్యం చేయకుండా టీవీలో వీలైనంత త్వరగా కొత్త సినిమాలు ప్రసారం చేసేందుకు ఛానల్స్ పోటీ పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హక్కుల కోసం వాటి మీద పెట్టిన భారీ పెట్టుబడులే.

జై లవకుశ కూడా అందులో భాగంగానే జనవరి 13వ తేది ప్రసారం చేయనున్నారు. ఆపాటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సినిమాలు విడుదలై ఉంటాయి. ఆ మరుసటి రోజు రాజ్ తరుణ్ రంగుల రాట్నం విడుదల ఉంటుంది. సో టైమింగ్ కూడా అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. ఈ మధ్య టీవిలో వచ్చే సినిమాల టిఆర్పి రేటింగ్స్ ఆదాయ పరంగా చాలా కీలకంగా మారుతున్నాయి. కొన్ని వారాల క్రితం జయజానకి నాయక టీవిలో వస్తే 15 దాకా రేటింగ్ తెచ్చుకుని ఔరా అనిపించుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అనిపించుకున్న సినిమాలు టీవీలలో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మరి ఇప్పుడు జై లవకుశ రూపంలో బ్లాక్ బస్టర్ టెలికాస్ట్ అవుతోంది. అందులోనూ యంగ్ టైగర్ హీరో. ఇక రేటింగ్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాలా.