Begin typing your search above and press return to search.
జైలవకుశ.. ఏదో తేడా కొడుతోందే
By: Tupaki Desk | 14 Sep 2017 5:13 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా జైలవకుశ విడుదలకు అంతా సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్సీ రేట్లకే విక్రయించారు. రిలీజ్ రోజుల్లో టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఉన్నచోట్ల రేట్లు పెంచడానికి ఆల్రెడీ ప్రిపేరైపోయారు. ప్రస్తుతం సినిమా కలెక్షన్లలో కీలకంగా మారిన ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా తీరు డిఫరెంట్ గా కనిపిస్తోంది.
ఓవర్సీస్ లో జైలవకుశ ప్రీమియర్లు 20 నుంచే ప్రారంభం కానున్నాయి. సాధారణంగా యూఎస్ లో పెద్ద సినిమాలను భారీ మొత్తమే ఇచ్చి కొంటారు. దానికి తగ్గట్టే 20 డాలర్లపైనే టిక్కెట్ ధర నిర్ణయిస్తారు. మరీ క్రేజ్ ఎక్కువుందని అనిపిస్తే 25 డాలర్ల వరకు కూడా రేట్ పెడుతుంటారు. కానీ జైలవకుశ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ప్రీమియర్స్ కు 18 డాలర్లు - మామూలు షోస్ కు 16 డాలర్లు మాత్రమే టిక్కెట్ ధరగా నిర్ణయించారు. జైలవకుశ సినిమాకు ఇప్పటికే కావల్సినంత బజ్ వచ్చింది. ఈలెక్కన సినిమా ప్రీమియర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు రేట్ పెంచినా జనాలు బాగానే వస్తారు. కానీ తక్కువ ధరపెట్టడం ఎన్ ఆర్ ఐలకు కాస్తంత ఆశ్చర్యమే కలిగిస్తోంది.
సినిమా ప్రీమియర్ రేట్లు ఎక్కువగా ఉండి రివ్యూలు నెగిటివ్ గా వస్తే యూఎస్ లో థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. అదే రేటు తక్కువగా ఉంటే రివ్యూలతో పనిలేకుండా ఇంట్రస్ట్ ఉన్నవాళ్లంతా సినిమాకు వచ్చే అవకాశముంది. ఆ రకంగా సినిమాకు కలెక్షన్లు మరీ పడిపోకుండా ఉంటాయి. మాములుగా మీడియం రేంజి సినిమాలకు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారు. జైలవకుశేమో ఏ రకంగా చూసుకున్నా భారీ చిత్రమే. అసలు రివ్యూలు బాగోక సినిమా చూడటానికి రాకపోతే అన్న ఆలోచన ఇప్పుడే చేయాల్సిన అవసరమేంటి?
ఇదేదో కొత్త ట్రెండ్ అనుకున్నా భారీ మొత్తాలిచ్చి రైట్స్ కొనుక్కునేది లాభాలు సంపాదించుకోవడానికి కానీ సేవ చేయడానికి కాదు కదా. అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్ ను అంత భయపెట్టి.. ముందుజాగ్రత్త తీసుకునేలా చేసిన అంశాలు ఏమయి ఉండొచ్చు. మొత్తానికి ఇదేదో కాస్త తేడా కొడుతోందే..