Begin typing your search above and press return to search.

లవకుశ కూడా తక్కువకే జై అనేసిందా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 5:38 AM GMT
లవకుశ కూడా తక్కువకే జై అనేసిందా?
X
మొత్తానికి మన సినిమా నిర్మాతలే తగ్గారు కాని.. ఓవర్సీస్ డిస్ర్టిబ్యూటర్లు మాత్రం ఈసారి తగ్గలేదు. అసలు ఇక్కడ హిట్టయితేనే డబ్బులు సరిగ్గా రికవర్ కాని పరిస్థితి ఉన్నప్పుడు.. ఇంకా ఫ్లాపైతే ఏం రికవరీ ఉంటుంది చెప్పండి. అందుకే జై లవ కుశ.. స్పైడర్.. పైసా వసూల్ వంటి సెప్టెంబర్ సినిమాలు కొనడానికి అమెరికాలోని పంపిణీదారులు చాలా కండిషన్లే పెట్టారు. చివరకు నిర్మాతలు తక్కువ రేటుకు అమ్ముకోక తప్పలేదు. కాని అది కూడా ఎక్కువేలే.

ఉదాహరణకు స్పైడర్ సినిమాకు ఏకంగా 21 కోట్లు కావాలంటూ కోట్ చేశారు. కాని చివరకు తెలుగు మరియు తమిళ లాంగ్వేజ్ ఓవర్సీస్ రైట్లను 15+ కోట్లకే విక్రయించారు. అయినాసరే 3.5 మిలియన్ డాలర్లు కలక్షన్ వస్తేనే స్పైడర్ వీళ్లను ఒడ్డుకు లాగే ఛాన్సుంటుంది. ఇప్పుడు జై లవ కుశ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. చాలా కావాలంటూ డిమాండ్ చేసి కళ్యాణ్ రామ్ ఏకంగా 18 కోట్ల వరకు కోట్ చేశాడట. 15కు ఓకె అన్నాడట. కాని చివరకు ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ 10+ కోట్లకు సినిమాను కొన్నాడట. ఇంత తక్కువకే లవకుశ జై కొట్టించుకున్నా కూడా.. రేపు బాక్సాఫీస్ దగ్గర్ 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే కాని ఈ పంపిణీదారులకు లాభాలు వచ్చే ఛాన్సు లేదు.

ఈ మధ్య కాలంలో 1 మిలియన్ నుండి మనోళ్ళు 2 మిలియన్ దిశగా వెళ్తున్నారు. ఆల్రెడీ ఖైదీ నెం 150 ఈ మార్కును అందేసుకోగా.. ఫిదా సినిమా కూడా అందుకు దగ్గరగానే ఉంది. అయితే ఇక నుండి 2 మిలియన్ అనేది ఆసక్తికర నెంబర్ కాదు.. ఖచ్చితంగా అందుకోవాల్సిన నెంబర్.. లేదంటే ఈ సినిమాలన్నీ పంపిణీదారులను ముంచేస్తాయి. లెటజ్ సీ.