Begin typing your search above and press return to search.
టాప్ 10లో రెండవసారి తారక్
By: Tupaki Desk | 21 Sep 2017 1:20 PM GMTవిడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసుకున్న జై లవకుశ ఎట్టకేలకు విడుదలై పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించగా కె.ఎస్ రవీందర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన కళ్యాణ్ రామ్ కి ఎంతవరకు లాభాన్ని ఇస్తుందనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బావుంది అన్నారు. అక్కడక్కడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి ఎన్టీఆర్ మొదటి సారి త్రిపాత్రాభినయంతో కనిపిస్తుండడంతో ప్రేక్షకులు టాక్ ని లెక్క చేయకుండా వెళుతున్నారు. ఇక ఈ సినిమాను ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక యు.ఎస్.ఏ లో అయితే 159 స్క్రీన్స్ లో ప్రీమియర్ షోను వేశారు. అయితే ప్రీమియర్ షోలో తారక్ మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇప్పటివరకు ప్రీమియర్స్ షోల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ తెలుగు చిత్రాల్లో జై లవకుశ నిలిచింది. $539000 లను రాబట్టి 7వ స్థానంలో నిలిచింది. ఇక అయిదవ స్థానంలో జనతా గ్యారేజ్ ఉంది.
USA ప్రీమియర్ షోల్లో టాప్ 10 వసూళ్లను సాధించిన చిత్రాలు
బాహుబలి 2 - $ 4517704
బాహుబలి 1 - $ 1364416
ఖైదీ నెంబర్ 150 - $ 1295613
సర్డార్ గబ్బర్ సింగ్ - $ 616054
జనతా గ్యారేజ్ - $ 584255
బ్రహ్మోత్సవం - $ 560274
జై లవకుశ - $ 539000
దువ్వాడ జగన్నాథమ్ - $ 538011
శ్రీమంతడు - $ 535984
ఆగడు - $ 523613