Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లోనే వందకు పైగా థియేటర్లలో...
By: Tupaki Desk | 16 Sep 2017 11:57 AM GMTమూడు వారాలుగా సినిమాలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. ఏదీ ప్రేక్షకుల ఆకలి తీర్చట్లేదు. ఈ వారం వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఇక ప్రేక్షకుల ఆశలన్నీ దసరా సీజన్లో రాబోయే మూడు సినిమాల మీదే ఉన్నాయి. వాటిలో ముందుగా థియేటర్లలోకి దిగబోయేది ‘జై లవకుశ’. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అసలే బాక్సాఫీస్ స్లంప్ లో ఉన్న సమయంలో రిలీజవుతున్న సినిమా కావడం.. మంచి హైప్ తెచ్చుకున్న సినిమా కూడా కావడంతో దీన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే అవుతుందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ‘జై లవకుశ’ను దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. వచ్చే వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లోనే 80-90 శాతం థియేటర్లలో ‘జై లవకుశ’నే ఆడే అవకాశాలున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 100కు పైగా స్క్రీన్లలో ‘జై లవకుశ’ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది బిగ్ నంబరే. ఎన్టీఆర్ సినిమా ఇంతకుముందెన్నడూ హైదరాబద్ లో సెంచరీ కొట్టింది లేదు. సినిమా గురువారమే విడుదలవుతుండటం కలిసొచ్చే అంశం. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని సరిగ్గా ఉపయోగించుకుంటే తొలి వారాంతంలోనే పెట్టుబడులు చాలా వరకు రికవర్ అయిపోయే అవకాశాలున్నాయి. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.85 కోట్లకు అమ్మడం విశేషం. మొత్తంగా ‘జై లవకుశ’ రూ.110 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.