Begin typing your search above and press return to search.

190 లొకేషన్లు.. 500 స్క్రీన్లు

By:  Tupaki Desk   |   19 Sep 2017 5:15 PM GMT
190 లొకేషన్లు.. 500 స్క్రీన్లు
X
టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా మార్కెట్ బాగా పెంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ర‘నాన్నకు ప్రేమతో’ ఏకంగా 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడితే.. ‘జనతా గ్యారేజ్’ కూడా 1.8 మిలియన్ల దాకా వసూలు చేసింది అమెరికాలో. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ను యుఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కు అమెరికాలో ‘జై లవకుశ’నే బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది. అమెరికాలో 190 లొకేషన్లలో.. 500 స్క్రీన్లలో ‘జై లవకుశ’ రిలీజ్ కాబోతోంది. అన్నిచోట్లా బుధవారమే ప్రిమియర్లు కూడా భారీ ఎత్తున పడబోతున్నాయి. కాబట్టి ఇది యుఎస్ లో ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. ఈ చిత్రానికి హైప్ అయితే బాగానే ఉంది.

‘జై లవకుశ’ ఓవర్సీస్ హక్కులు రూ.8.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది కూడా ఎన్టీఆర్ కెరీర్లో రికార్డు. పెట్టుబడి వెనక్కి రావాలంటే ఈ సినిమా అక్కడ 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయాలి. ఐతే సినిమాపై ఉన్న హైప్ ప్రకారం చూస్తే.. ఓ మోస్తరు టాక్ వచ్చినా 1.5 మిలియన్ డాలర్లు పెద్ద విషయం కాదు. వీకెండ్లోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసే అవకాశముంది. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం మరోసారి తారక్ 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం ఖాయం.