Begin typing your search above and press return to search.
ఈ టైమ్ జోన్స్ గోల ఏంటి లవకుశా..
By: Tupaki Desk | 6 July 2017 7:06 AM GMTఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ కొత్త సినిమా ''జై లవ కుశ'' టీజర్ విడుదలవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివకే ఒక టీజర్ లీకవ్వడం.. అందులోని కొన్ని ఎలిమెంట్స్ ఇంప్రెసివ్ గానే ఉండటంతో.. ఇప్పుడు జూనియర్ ఫ్యాన్స్ అందరూ ఈరోజు రిలీజయ్యే టీజర్ కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టీజర్ తాలూకు ముహూర్తాల యాడ్ ఒకటి భలే ఆసక్తిగా ఉందిలే.
నిజానికి ఇండియాలో ఈరోజు సాయంత్రం గం. 5.22 నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నారు. ఈ ముహూర్తం విషయంలో కూడా టోటల్ 9 వచ్చేలా చూసుకుని జూ.ఎన్టీఆర్ తనకు న్యూమరాలజీ మీద ఎంత నమ్మకమో చెప్పకనే చెబుతున్నాడు. అయితే ఇండియాలో 5.22 పిఎం అయినప్పుడు ఫారిన్లో రకరకాల ఊళ్ళలో టైమ్ ఎంతవుతుందో గూగుల్ లో కొట్టినా వస్తుంది. కాని మనోళ్ళు మాత్రం.. న్యూయార్క్ లో లండన్లో దుబాయ్ లో సింగపూర్లో మెలబోర్న్ లో ఏయే టైములకు రిలీజ్ అవుతుంది అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు తెలుసా? హడావుడి చేయాలనే నెపంతో ఇలా కామెడీలు కూడా చేస్తున్నారు.
ఇకపోతే కె.ఎస్.రవీంద్ర (బాబీ) డైరక్షన్ లో వస్తున్న జై లవకుశ ముందు చాలా ఛాలెంజులే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ నిర్మాతగా నాలుగు రాళ్లు వెనకేయాలి.. ఇప్పటివరకు వచ్చిన హిట్ స్ర్టీక్ ను ఎన్టీఆర్ కంటిన్యూ చేయాలి.. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలు తీయలేకపోయాడు అనే అపవాదను బాబీ దూరం చేసుకోవాలి. వెయిట్ అండ్ సీ.. టీజర్ చూస్తే వంటకం రుచి కాస్త తెలిసే ఛాన్సుంటుందిగా!!