Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: సూపర్ జై.. రొటీన్ లవ కుశ
By: Tupaki Desk | 11 Sep 2017 12:34 AM GMTఇప్పటి రోపుల్లో సింపుల్ ఎమోషన్ తో కథను లాగించేస్తాం అంటే జనాలు ఒప్పుకోవట్లేదు. అయితే ఆ ఎమోషన్ అర్జున్ రెడ్డిలా చాలా హార్డుగా ఉండాలి.. లేదంటే జనతా గ్యారేజ్ సినిమా తరహాలో ఒక భారీ కథైనా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా కూడా ఆ సినిమాలకు కాస్త ఇబ్బంది తప్పట్లేదు. ఈ సమయంలో అసలు కథ చెప్పకుండా వచ్చిన 'జై లవ కుశ' ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.
ఆల్రెడీ రావణాసురుడి లక్షణాలు పోలి ఉన్న 'జై' క్యారక్టర్ టీజర్ బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన లవ అండ్ కుశ క్యారక్టర్లు మాత్రం జనాలకు పెద్దగా ఎక్కలేదు. ఇప్పుడిక ట్రైలర్లో కూడా అదే పరిస్థితిలే. ముగ్గురు అన్నదమ్ములు.. ట్విన్స్.. రామ లక్ష్మణ భరతులు అనుకుంటే.. వారు రావణ.. రామ.. లక్ష్మణులు అయిపోయారు. అందులో లవ బ్యాంకులో పనిచేస్తుంటాడు. కుశ మాత్రం చిన్న చిన్న చోరీలు చేస్తూ.. బ్యాంకులో కూడా ఫుల్లుగా కామెడీ చేస్తాడు. ఇక సడన్ గా ఒకసారి వారిద్దరికీ జై ఇచ్చిన ట్విస్ట్ ఏంటనేదే సినిమా. మనలాగే ఉండే ఇంకొకడు చేసుంటాడు అంటూ ఇద్దరు ఎన్టీఆర్ లు చెప్పుకోవడంతో.. సినిమాలో ఏముందో అర్ధం చేసుకోవచ్చు. అందరికంటే జై పాత్ర ఒక్కటే చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. మిగతా రెండు పాత్రలూ అంతగా ఆకట్టుకోవట్లేదనే చెప్పాలి.
అయితే ఈ సినిమాల్లో మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ దాదాపు ఒకే తరహాగా ఉన్నాడు. మీసాలు తిప్పడం.. బట్టలు మార్చడం తప్పిస్తే.. 24 సినిమాలో ఒక సూర్య తరహాలో పెద్దగా క్యారక్టర్లలో ఫిజికల్ చేంజ్ లేకపోవడం.. అంతగా ఇంప్రెస్ చెయ్యలేదు. ఇక పాటలతో డిజప్పాయింట్ చేసిన దేవిశ్రీప్రసాద్.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే కొట్టాడులే. బాబీ కూడా సీన్లను బాగా డైరక్ట్ చేసినట్లే కనిపిస్తున్నాడు. రాశి ఖన్నా అచ్చం జనతాగ్యారేజ్ లో సమంత లా ఉంటే.. నివేదా మాత్రం.. కాస్త బోల్డ్ గా ఉంది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే రొటీన్ మసాలా మూవీ అన్నట్లున్నా.. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించడం అనేది హైలైట్ పాయింట్. చూద్దాం సెప్టెంబర్ 21న ఈ కవలలు ఏం చేస్తారో!!