Begin typing your search above and press return to search.
వీడియో టాక్: జై ఎంత కష్టపడ్డాడంటే..
By: Tupaki Desk | 22 Sep 2017 1:28 PM GMTఎన్టీఆర్ కెరీర్ లో జై లవకుశ సినిమా ద్వారా కొన్ని కొత్త విషయాలు ప్రధానంగా మొదటి సారి నమోదయ్యాయని చెప్పాలి. మొదటి సారి మూడు పాత్రలను చేశాడు అలాగే మొదటి సారి అత్యధిక భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాడు, అది కూడా మొదటి సారి తన అన్నయ్య ప్రొడక్షన్ లో చేయడం. ఇక అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవ్వడం సెన్సేషన్. ఇంతటి ప్రాధాన్యత గల చిత్రానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు పాత్రలను దేనికి అదే పోటీ అన్నట్టుగా చేసి ప్రేక్షకులను అలరించాడు.
గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల వారిని అక్కట్టుకునే కథాంశం ఉండడంతో చిత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అంతే కాకుండా దర్శక దిగ్గజాలైన కె.రాఘవేంద్ర రావ్ మరియు రాజమౌళి మన్ననలను తారక్ అందుకున్నాడు. ఇక సినిమాలో హైలెట్ అయిన జై పాత్ర చాలా మందిని ఆకర్షించింది. ఎవ్వరు చూసిన జై పాత్రకే ఎక్కువగా ఓటేస్తున్నారు. దీంతో ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ తెర వెనుక ఎంత కష్టపడ్డాడో చిత్ర యూనిట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
అందులో ఎక్కువగా క్లయిమాక్స్ సీన్స్ మేకింగ్ ను చూపెట్టారు. యాక్షన్ సీన్స్ లో తారక్ ఎంత ప్రాణం పెట్టాడో అర్ధమవుతోంది. ఇక ఎంట్రీ సీన్స్ కూడా ఆ వీడియో లో ఉన్నాయి. కోపంతో కన్నెర్ర చేస్తూ చూపించిన హావభావాలు వర్ణనాతీతమనే చెప్పాలి. ప్రతి సిన్ లో తన ఆహార్యాన్ని చూపించాడు. స్టయిల్ కూడా చాలా బావుంది. మొత్తానికి ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత మరో మంచి సినిమాను అభిమానులకు ఇచ్చాడని చెప్పవచ్చు.