Begin typing your search above and press return to search.
జైసింహ పది రోజుల షేర్ ఎంత
By: Tupaki Desk | 22 Jan 2018 7:50 AM GMTసంక్రాంతి సినిమాల్లో ఏకగ్రీవంగా విజేత అని చెప్పే సినిమా ఏది లేనప్పటికీ పెట్టిన పెట్టుబడి-వచ్చిన వసూళ్లు ప్రకారం చూసుకుంటే బాలకృష్ణ జైసింహ బెటర్ పొజిషన్ లో నిలిచింది అని ట్రేడ్ సైతం ఒప్పుకునే మాట. పది రోజుల రన్ పూర్తి చేసుకున్న జైసింహ రెండో వారం నుంచి జోరు తగ్గించాడు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడం - ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి జాబులు వాళ్ళు చేసుకోవడంలో బిజీ అవ్వడంతో అన్ని సినిమాలకు థియేటర్ల దగ్గర సందడి తగ్గింది. మొదటివారం ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య మూడో వారం ఎంటర్ అవుతున్న సమయంలో బాగా నెమ్మదించాడు. కేవలం 2 కోట్ల షేర్ మాత్రమే జోడించాడు. ఇది అంత చెప్పుకోదగిన మార్క్ కాకపోయినా ఫస్ట్ వీక్ లో వచ్చిన 23 కోట్లను కలుపుకుని చూస్తే మొత్తం పాతిక కోట్లతో చెప్పుకోదగ్గ ఫిగర్ తోనే జైసింహ రన్ అవుతోంది. చేతిలో మరో మూడు రోజులు ఉన్నాయి.
రిపబ్లిక్ డే సెలవు - ఆఖరి శనివారం - ఆపై ఆదివారం ఇలా లాంగ్ వీక్ ఎండ్ కొంత వరకు హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి కాని పద్మావత్ - భాగమతి - ఆచారి అమెరికా యాత్ర కొత్త సినిమాలతో పోటీ భయం కూడా మొదలవుతుంది. అయినా కూడా మొత్తంగా జైసింహను తీసేసే పరిస్థితి లేదు కాబట్టి మరో రెండు మూడు కోట్లు వచ్చినా నష్టాలు లేకుండా కొనుగోలుదారులు సేఫ్ గా గట్టెక్కిన వారు అవుతారు. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే జైసింహ అత్యధికంగా సీడెడ్ లో 5.4 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. నైజాంలో 4 కోట్లు - ఆంధ్ర మొత్తం కలిపి 13 కోట్ల దాకా షేర్ ఇచ్చిన బాలయ్య ఓవర్సీస్ లో మాత్రం కోటి మార్కును ఇంకా చేరలేకపోయాడు. 28 కోట్ల దాకా బిజినెస్ చేసిన జైసింహ మరో మూడు కోట్లు తెస్తే నష్టాలే రాని సంక్రాంతి సినిమాగా మిగులుతుంది. వారాంతం పెద్దగా ఉన్న నేపధ్యంలో అది మరీ అసాధ్యం కాదు అని ట్రేడ్ టాక్.