Begin typing your search above and press return to search.

జై సింహ ఐదు రోజుల లెక్కలు

By:  Tupaki Desk   |   17 Jan 2018 12:50 PM GMT
జై సింహ ఐదు రోజుల లెక్కలు
X
సంక్రాంతి సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికి దొరకలేదు కాని ఉన్నంతలో కొంత మెరుగ్గా కమర్షియల్ కంటెంట్ తో తన జైసింహను లాక్కొస్తున్నాడు బాలయ్య. బిసి సెంటర్స్ లో బాగా బలంగా ఉన్న జైసింహ మిగిలిన చోట్ల కూడా బాగానే రాబడుతూ ఉన్నవాటిలో బెటర్ అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాడు.

కథ, కథనం ఏళ్ళ నాటి ఫార్ములాలోనే సాగినా సెంటిమెంట్ - ఎమోషన్ - పాటలు మాస్ ప్రేక్షకులను ఓ మాదిరిగా సంతృప్తి పరచడం వల్లే ఇవి సాధ్యమవుతున్నాయి. ఇక ఐదు రోజులకు గాను పెట్టిన పెట్టుబడి ప్రకారం చూసుకుంటే జైసింహ బయ్యర్స్ నష్టాలు పాలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనేది ట్రేడ్ రిపోర్ట్. కాని సెలవులు పూర్తిగా ముగిసాక దీని గురించి స్పష్టత వస్తుంది. ఇక జైసింహ ఏరియావారి ఐదు రోజుల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

గ్రాస్ షేర్

(కోట్లలో) (కోట్లలో)

వైజాగ్ 2.16

ఈస్ట్ 1.77

వెస్ట్ 1.52

కృష్ణా 1.28

గుంటూర్ 2.06

నెల్లూరు 0.98

ఆంధ్ర 9.77 14.6

సీడెడ్ 4.51 5.8

నిజాం 3.62 6.2

తెలుగు రాష్ట్రాలు (మొత్తం) 17.9 26.6


యుఎస్ 0.42 1.4

కర్ణాటక 1.41 3.0

మిగిలిన చోట 0.82 2.3

ప్రపంచవ్యాప్తంగా (మొత్తం) 20.55 33.3

ఇప్పటికి చాలా డీసెంట్ కలెక్షన్స్ సాధించిన జైసింహ ముందు ముందు ఇలాగే కొంచెం స్టడీగా కనక కంటిన్యూ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి రావొచ్చు. కాని పండగ తొలి ఐదు రోజులు అయిపోయాయి కాబట్టి ఇదే రకమైన వసూళ్లు ఆశించడం కష్టమే కాని పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం బాలయ్యకు బెనిఫిట్ గా మారనుంది. సీడెడ్ లో ఐదు రోజులకు 4 కోట్ల 50 లక్షల పై చిలుకు షేర్ తెచ్చిన జైసింహ అక్కడ బాలయ్యకు ఎంత బలమైన మాస్ ఫాలోయింగ్ ఉందొ మరోసారి ఋజువు చేసింది. టాక్ తో సంబంధం లేకుండా గతంలో డిక్టేటర్ కూడా సీడెడ్ లో లాభాలు ఇచ్చింది. జైసింహ పూర్తి స్టేటస్ తెలియాలంటే వారం పది రోజులు పూర్తయ్యాక స్పష్టత వస్తుంది.