Begin typing your search above and press return to search.
జై సింహా టార్గెట్ సింపులే
By: Tupaki Desk | 10 Jan 2018 4:04 AM GMTనందమూరి హీరో బాలకృష్ణ లేటెస్ట్ మూవీ జైసింహా రిలీజుకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి బాలయ్యకు సెంటిమెంట్ గా కలిసిరావడం.. హీరోయిన్ నయనతారతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ కావడం... భారీ కాస్టింగ్ వంటివన్నీ జైసింహాపై బజ్ పెంచాయి. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చాలాకాలం తరవాత డైరెక్ట్ చేసిన స్ట్రయిట్ తెలుగు చిత్రమిది.
బాలయ్య లాస్ట్ సినిమా పైసా వసూల్ లో కొత్తదనం ఏమీ లేకపోవడంతో బాక్సాఫీసును ఆకట్టుకోలేకపోయింది. దాంతో జై సింహా స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ థియేటర్లలో రూ. 27 కోట్లు రాబట్టగలిగితే నిర్మాత.. బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారు. కిందటి ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి రూ. 50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టగలిగింది. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధికంగా వసూలైన కలెక్షన్ ఇది. ఇప్పుడు జైసింహా కూడా సంక్రాంతి సీజన్ లో వస్తోంది. ఈ సీజన్ లో ఐదురోజుల పాటు కలెక్షన్లకు ఢోకా ఉండదనే చెప్పుకోవచ్చు. ఈ లెక్కన చూసుకుంటే జై సింహా రూ. 27 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ బాలయ్యకు మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉండటం సినిమాకు మరింత ప్లస్సవుతుంది.
జై సింహా టార్గెట్ రూ. 27 కోట్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ. 23.5 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాలు.. ఓవర్సీస్ మిగతా మొత్తం బిజినెస్ అయింది. ఈ మొత్తంలో బాలయ్యకు వీరాభిమానులున్న సీడెడ్ నుంచే రూ. 5 కోట్ల వరకు వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అజ్ఞాతవాసి తప్ప పెద్ద సినిమాలేవీ పోటీ లేవు. కాస్త మంచి టాక్ వస్తే టార్గెట్ మొత్తం ఈజీగానే వసూలయ్యే అవకాశముంది.