Begin typing your search above and press return to search.
ఎఫ్ ఎన్ సీసీ గొడవలు నిజమెంత?
By: Tupaki Desk | 18 March 2019 4:47 AM GMTవరుసగా టాలీవుడ్ లో గొడవలు రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ఇరు ప్యానెల్స్ మధ్య ఊపిరిసలపనివ్వనంతగా గొడవలు రచ్చకెక్కాయి. దీంతో ఆర్టిస్టుల పరువు మర్యాదలు గంగలో కలిశాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో సినీపెద్దలు సైతం చేతులెత్తేసిన వైనం కనిపిస్తోంది. సీనియర్ నరేష్ అధ్యక్షుడిగా గెలిచాకా.. శివాజీ రాజాతో వైరం ఇప్పటికీ అలానే ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. మా మధ్య ఏ గొడవలూ లేవంటూనే ఆ ఇద్దరూ కొట్లాడుకోవడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. `మా` గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య పర్సనల్ వైరానికి సంబంధించిన గొడవలా? అంటూ ఆసక్తికర చర్చా సాగుతోంది.
ఈ డర్టీ గొడవల గురించి చర్చ సాగుతుండగానే మరో గొడవ బయటపడింది. ఈసారి సినీపెద్దల సాక్షిగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సీసీ) లో గొడవల రచ్చ బయటపడింది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ .. విజయా రెడ్డి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈనెల 10న పేకాట క్లబ్ లో ఇరువురి మధ్యా ఘర్షణ జరిగిందని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు అరుచుకుని బూతులు తిట్టుకునేంత వరకూ వెళ్లడం.. అటుపై ఎఫ్ ఎన్ సీసీ కమిటీకి ఫిర్యాదు చేయడం వరకూ వెళ్లడంతో ఆ ఇద్దరిపైనా సస్పెన్షన్ విధించారని తెలుస్తోంది. ఆ సస్పెన్షన్ కి సంబంధించిన ఆర్డర్ కాపీ ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతోంది. సి.కళ్యాణ్, విజయా రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షుడు కె.ఎల్.నారాయణ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకు వచ్చింది.
అసలు ఎఫ్ ఎన్ సీసీ అంటేనే సినీ పెద్దల సభ. అక్కడ టాలీవుడ్ తో అనుబంధం ఉన్న పారిశ్రామిక వేత్తలు.. రాజకీయ నాయకులు .. బిగ్ షాట్స్ అన్నీ కొలువు దీరి సెలబ్రేట్ చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్.. సినిమాలు వేసే ఓపెన్ స్క్రీన్.. ఇండోర్ గేమ్స్.. వగైరా వగైరా వసతులు ఉన్న ఈ చోట నిరంతరం పండగ వాతావరణంలానే ఉంటుంది. ఇందులోనే టాప్ సెలబ్రిటీల బర్త్ డేలు, పెళ్లి రోజులు వగైరా ఈవెంట్లు జరుగుతుంటాయి. అయితే అలాంటి కీలకమైన చోట ప్రతిష్ఠకు భంగం వాటిల్లడంపై ప్రముఖంగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్యా గొడవకు కారణమేంటో విచారణ సాగుతోందట. కారణం ఏదైనా పెద్దలే కొట్లాడుకోవడం చూస్తుంటే పరువు పోతోంది! అంటూ మాట్లాడుకోవడం చర్చకొచ్చింది.