Begin typing your search above and press return to search.
జైలర్.. ఈ స్టార్ క్యాస్ట్ నెవ్వర్ బిఫోర్
By: Tupaki Desk | 20 Jan 2023 6:30 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీలో రజినీకాంత్ జైలర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటి వరకు ఏ దర్శకుడు చేయని సాహసం చేసాడని చెప్పాలి.
తమిళ్ లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో తమిళ్ స్టార్స్ ని పెట్టుకోవడానికి ఇతర దర్శకులు ప్రయత్నం చేస్తారు. తెలుగులో వస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఒకరిద్దరు తప్ప మేగ్జిమమ్ నటులు అందరూ టాలీవుడ్ కి చెందిన వారే ఉంటారు. అయితే దీనిని బ్రేక్ చేస్తూ మొదటి సారి కోలీవుడ్ లో రజినీకాంత్ సినిమా కోసం నెల్సన్ దిలీప్ సౌత్ ఇండియాలో అన్ని భాషలకి చెందిన నటులని రంగంలోకి దించారు.
జైలర్ మూవీలో మలయాళీ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ గా రమ్యకృష్ణ, తెలుగు ఇండస్ట్రీ నుంచి విలన్ పాత్ర కోసం సునీల్ ని ఎంపిక చేశారు. అలాగే హీరోయిన్ గా సౌత్ తో పాటు నార్త్ కూడా మంచి ఇమేజ్ ఉన్న తమన్నా భాటియాని ఫైనల్ చేశారు. ఇక తమిళ్ ఇండస్ట్రీ నుంచి వినాయకన్, వసంత రవి, కమెడియన్ యోగిబాబుని కీలక పాత్రల కోసం నెల్సన్ దిలీప్ ఎంపిక చేశారు.
ఇంత మంది క్యాస్టింగ్ తో జైలర్ సినిమాతో సౌత్ లో అన్ని భాషలలో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. జైలర్ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ రెడీ చేస్తున్నాడు. మరి ఇన్ని భాషల నటులతో తెరకెక్కిన జైలర్ మూవీ రజినీకాంత్ కి ఏ స్థాయిలో సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.