Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్‌ తో జక్కన్న ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి..!

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:22 AM GMT
ఆర్ఆర్ఆర్‌ తో జక్కన్న ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి..!
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కోసం మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా గ్లిమ్స్ ను విడుదల చేసి ఆ అంచనాలను ఆసక్తిని రెట్టింపు చేయడం జరిగింది అనడంలో సందేహం లేదు. భారీ ఎత్తున అంచనాలు పెంచే విధంగా గ్లిమ్స్ ఉన్నాయి. నిమిషం కూడా లేని గ్లిమ్స్ లో జక్కన్న మొత్తం సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. అద్బుతమైన విజువల్ వండర్ లా ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. బాహుబలి సినిమాలో చూపించిన విజువల్స్ కంటే అద్బుతమైన విజువల్స్ ను ఆర్ ఆర్‌ ఆర్‌ లో చూడబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూనే ఉన్నారు.

ఇద్దరు స్టార్‌ హీరోలు భారీ స్టార్‌ కాస్టింగ్ ఉన్న సినిమా అవ్వడం వల్ల సహజంగానే భారీ ఎత్తున విజువల్ వండర్‌ గా ఈ సినిమా ఉంటుంది. కనుక ఖచ్చితంగా అభిమానులు ఈ సినిమాను ఆహా ఓహో అన్నట్లుగా అభిమానించడం ఖాయం. ఇక అవన్నీ ఒక ఎత్తు అయితే రాజమౌళి మేకింగ్‌ మరియు ఆయన విజనరీతో అందించే విజువల్స్ మరో ఎత్తు అవుతాయి. గ్లిమ్స్ చాలా స్పీడ్‌ గా సాగింది. ఒక్కో సెకనుకు ఒక్కో షాట్ అన్నట్లుగా ప్రతి షాట్ కూడా అద్బుతంలా అనిపించింది. ప్రతి సెకను కు పాజ్ చేసి చూస్తే కళ్లు పెద్దవి చేసుకుని చూసేలాంటి విజువల్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఇలాంటి విజువల్స్ ను ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు చూసి ఉండము అంటూ అభిమానులు ధీమాగా చెప్పేలా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయి అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఇండియన్ సినిమాను బాహుబలి తో ఇప్పటికే ఎక్కడికో తీసుకు వెళ్లిన రాజమౌళి ఈసారి ఆర్ ఆర్ ఆర్ తో హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నిలుపుతున్నాడు అనడంలో సందేహం లేదు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ఇద్దరు స్టార్‌ హీరోలు.. బాలీవుడ్‌ హీరో.. ఆలియా భట్ అని కాకుండా రాజమౌళి సినిమా అని చూడబోతున్న వారు లక్షల్లో ఉన్నారు. వారందరికి ఖచ్చితంగా పూర్తి స్థాయి సంతృప్తిని రాజమౌళి అందించేలా ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ జక్కన్న కూడా అంతటి భారీ విజువల్‌ వండర్ ను తీయలేడేమో అని కొందరు అనుకున్నారు. కాని ఆయనే మళ్లీ బాహుబలి ని మించిన విజువల్ వండర్ గా ఆర్ ఆర్ ఆర్‌ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కనుకగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుందని అంటున్నారు.