Begin typing your search above and press return to search.
జక్కన్న నెట్ ఫ్లిక్స్ రూ.100 కోట్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫిక్స్
By: Tupaki Desk | 13 July 2022 2:30 AM GMTటాలీవుడ్ జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. పలు దేశాల్లో ఇంకా కూడా భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. జక్కన్న తో ప్రాజెక్ట్ కోసం నెట్ ఫ్లిక్స్ వారు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా వంద కోట్ల ఆఫర్ ను జక్కన్న ముందు నెట్ ఫ్లిక్స్ వారు ఉంచారు అనేది బలంగా వినిపిస్తున్న వార్త.
సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ వారితో జక్కన్న ప్రాజెక్ట్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలికి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించడం జరిగింది. కాని ఔట్ పుట్ సరిగా రాని కారణంగా మొత్తంగా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజమౌళి తో నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ గానే డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం జక్కన్న ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. అయితే జక్కన్న ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోవడం లేదు. ఆ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారితో పాటు శోభు యార్లగడ్డ నిర్మిస్తూ ఉండగా జక్కన్న తనయుడు ఎస్ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించబోతున్నట్లుగా జక్కన్న ఫ్యామిలీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
కార్తికేయ బాహుబలి సినిమా తో పాటు పలు సినిమాలకు జక్కన్న తో కలిసి వర్క్ చేశారు. దర్శకత్వం పై పూర్తి పట్టు ఉన్న కార్తికేయ గతంలో నిర్మాణంపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దర్శకత్వం చేయాలనే ఉద్దేశం లేదు అన్నాడు.
కాని తాజాగా ఆయన రాజమౌళి సూచన మేరకు నెట్ ఫ్లిక్స్ కోసం దర్శకుడిగా మారబోతున్నాడని అంటున్నారు.
నెట్ ఫ్లిక్స్ కోసం రాజమౌళి మరియు శోభు యార్లగడ్డ లు కలిసి కార్తికేయ దర్శకత్వంలో వెబ్ సిరీస్ ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక వైపు మహేష్ బాబు సినిమా పనుల్లో ఉన్న జక్కన్న మరో వైపు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ వర్క్ ల్లో కూడా పాలు పంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.