Begin typing your search above and press return to search.
మహేష్ ని కష్టపెట్టకుండా అద్భుతాన్ని చూపనున్న జక్కన్న
By: Tupaki Desk | 7 Sep 2022 5:30 PM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా పై ఫోకస్ పెట్టాడు. ఇదే సమయంలో తన తదుపరి సినిమా మహేష్ బాబు తో చేసేందుకు ఏర్పాట్లను కూడా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు రోజులో కనీసం కొద్ది సమయం అయినా జరుగుతున్నట్లుగా జక్కన్న కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు మరియు ఆర్ ఆర్ ఆర్ అంతకు ముందు వచ్చిన ఈగ సినిమా కూడా వీఎఫ్ఎక్స్ కి అత్యంత ప్రాముఖ్యత ఉన్నవే అనే విషయం తెల్సిందే. తెలుగులోనే కాకుండా ఇండియన్ సినిమాల్లో రాజమౌళి వాడినట్లుగా వీఎఫ్‌ఎక్స్ ని మరెవ్వరు వాడలేరు అనేది ఆయన అభిమానుల బలమైన అభిప్రాయం. ఆయన గ్రాఫిక్స్ వాడకుండా సినిమాను చేయలేడు అనేది మరో వాదన.
రాజమౌళి కొత్త కొత్త వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నాడు. వీఎఫ్‌ఎక్స్ ను మరీ ఇంతగా వాడవచ్చా అంటూ తెలుగు ప్రేక్షకులు ఆయన వాడకం కి ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. త్వరలో ఆయన మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకి కూడా గ్రాఫిక్స్ ను పీక్స్ లో వాడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
గ్రాఫిక్స్ టెక్నాలజీని తన సినిమా సినిమా కి మరింతగా ఎక్కువగా వినియోగించుకుంటున్న రాజమౌళి ఈసారి మహేష్ బాబు సినిమాకు కూడా అంతకు మించి అన్నట్లుగా వాడబోతున్నాడు. కనీసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేయకుండా గ్రాఫిక్స్ వర్క్ పై రాజమౌళి విదేశాలకు వెళ్లి వచ్చాడు. దాంతోనే మహేష్ బాబు సినిమాకు ఏ స్థాయిలో ఆయన గ్రాఫిక్స్ ను వాడబోతున్నాడో అర్థం అవుతుంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలోని భారీ యాక్షన్ అడ్వంచర్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయట. ఆ సన్నివేశాలు సాదారణంగా తీయాలంటే చాలా ఖర్చు.. అలాగే హీరోకు అత్యంత రిస్క్. కానీ జక్కన్న తీసుకు రాబోతున్న సరికొత్త టెక్నాలజీ తో ఆ సన్నివేశాలు చాలా ఈజీ అవ్వబోతున్నాయట.
ఇప్పటి వరకు ఆయన తన గత సినిమాలకు వినియోగించని టెక్నాలజీని వినియోగించడం ద్వారా మహేష్ బాబు కష్టం కూడా దాదాపుగా సగానికి తగ్గుతుందని అంటున్నారు. గ్రాఫిక్స్ వాడినంత మాత్రానా జక్కన్న సినిమాలో రియాలిటీ లేకుండా పోదు.
ఆయన ఎంత గ్రాఫిక్స్ వాడినా కూడా రియాల్టీ గా ఉండేంత వరకు మాత్రమే వాటిని వినియోగిస్తాడు అనే విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కనుక మహేష్ సినిమా కి కూడా జక్కన్న అదే రీతిలో గ్రాఫిక్స్ ని వాడబోతున్నాడట. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.