Begin typing your search above and press return to search.
అల్లూరి జయంతిని మర్చిన జక్కన్న
By: Tupaki Desk | 5 July 2021 4:34 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వచ్చే నెలలో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టాలని భావిస్తున్నారట. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూనే ఉంది. కనుక అనుకున్నట్లుగా అక్టోబర్ లో విడుదల సాధ్యమే అనే నమ్మకంతో కొందరు ఉన్నారు.
ఇక సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తున్న ఈ సమయంలో జక్కన్న వరుసగా పోస్టర్ లు వీడియోలు మేకింగ్ వీడియోస్ తో సందడి చేయాల్సి ఉంటుంది. కాని ఇప్పటి వరకు మీడియాలో సాదారణంగా జరిగే ప్రచారం తప్ప ప్రత్యేకంగా యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రచారం మాత్రం కనిపించడం లేదు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతి జరిగింది. ఆ రోజున అల్లూరి పాత్రలో నటించిన రామ్ చరణ్ నుండి ఒక పోస్టర్ అయినా వస్తుందని అంతా ఆశించారు. కాని మేకర్స్ మాత్రం పట్టించుకున్నట్లుగా అనిపించలేదు.
అల్లూరి పై సినిమా తీస్తు ఆయన జయంతి సందర్బంగా కనీసం పోస్టర్ విడుదల చేయక పోవడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుంటే కొందరు మాత్రం జక్కన్న మర్చి పోయాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ నుండి చిన్న పోస్టర్ వచ్చిన కూడా అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే వారు. కాని రాజమౌళి మాత్రం ప్రస్తుతానికి ఆ పని పెట్టుకోవాలని భావించలేదేమో. అందుకే పెద్దగా హడావుడి చేయకుండానే షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నాడు.
షూటింగ్ పునః ప్రారంభం అయ్యిందని చెప్పేందుకు గాను బుల్లెట్ పై హీరోలు ఇద్దరు రైడ్ కు వెళ్తున్న ఫొటోను రిలీజ్ చేశాడు. ఆ ఫొటో తెగ వైరల్ అయ్యింది. రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఫొటోనే కనిపించింది. రకరకాలుగా మార్ఫింగ్ చేసి నెటిజన్స్ ఆ ఫొటోలను షేర్ చేసుకున్నారు. అల్లూరి సీతారామ రాజు జయంతి సందర్బంగా కూడా మరో పోస్టర్ వస్తుందని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తుండగా కీలక పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఆలియా భట్ అల్లూరి మరదలు సీత పాత్రలో కనిపిస్తుందట. ఆమె కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా ఎప్పటికి గుర్తుండి పోయేలా ఆమె పాత్ర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారను.
రామ్ చరణ్ మరియు ఆమె కాంబోలో ఉండే సీన్స్ అద్బుతంగా ఉంటాయని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. అల్లూరి మరియు కొమురం భీమ్ పాత్రలతో స్వాతంత్ర్య ఉద్యమ సినిమా కాకుండా పూర్తి కల్పిత కథతో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా జక్కన్న చెబుతున్నాడు.