Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ‘జంబలకిడి పంబ’
By: Tupaki Desk | 22 Jun 2018 10:59 AM GMTచిత్రం : ‘జంబలకిడి పంబ’
నటీనటుులు: శ్రీనివాసరెడ్డి - సిద్ధి ఇద్నానీ - పోసాని కృష్ణమురళి - వెన్నెల కిషోర్ - సుమన్ - రఘుబాబు - షకలక శంకర్ - హరితేజ - తనికెళ్ల భరణి - సుధ - సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
నిర్మాతలు: రవి - జోజో జోస్
రచన - దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ (మను)
కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన తర్వాత హీరోలుగా మారిన నటుడు శ్రీనివాసరెడ్డి. ఐతే ఈ కోవలో హీరోలుగా మారిన కమెడియన్లతో పోలిస్తే అతను భిన్నం. హీరోయిజం కోసం ప్రయత్నించకుండా తనకు నప్పే కథల్ని ఎంచుకుంటూ మెప్పిస్తున్నాడు. ఇప్పుడతను ‘రైట్ రైట్’ దర్శకుడు జె.బి.మురళీ దర్శకత్వంలో నటించిన సినిమా ‘జంబలకిడి పంబ’. ఒకప్పటి ఈవీవీ కామెడీ క్లాసిక్ పేరు పెట్టుకున్న ఈ సినిమా.. ఆ టైటిల్ కు న్యాయం చేసిందా? ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కిందా? చూద్దాం పదండి.
కథ:
వరుణ్ (శ్రీనివాసరెడ్డి).. పల్లవి (సిద్ధి ఇద్నానీ) భార్యాభర్తలు. కానీ వాళ్లిద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. దీంతో ఇక లాభం లేదని విడాకులు తీసుకోవాలని అనకుంటారు. ఆ ప్రయత్నంలో ఉండగా.. వాళ్లకు డైవర్స్ ఇప్పించాల్సిన లాయర్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. అతను ఆత్మగా మారి వరుణ్.. పల్లవిలను కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్లు వినరు. దీంతో వీళ్లిద్దరితో అతనో ఆట ఆడతాడు. ఆ ఆట ఏంటి? దాని వల్ల వీళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? అసలు ఆ లాయర్ వీళ్లను కలపాలని ఎందుకనుకున్నాడు? అతడి ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాల పేర్లు పెట్టుకుని సినిమాలు తీయడం పెద్ద సాహసమే. ఆ టైటిళ్లతోనే జనాల్లో అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమాలు పాత సినిమాల్ని మ్యాచ్ చేయకపోయినా.. వాటిని చెడగొట్టకుండా ఉండేలా చూసుకోవడం కీలకం. హీరోగా నటించిన మూడు సినిమాలతోనూ మెప్పించి తన అభిరుచిని.. ప్రత్యేకతను చాటుకున్న శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడి పంబ’ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఈ మాటే చెప్పాడు. ఈవీవీ సినిమా పేరును ఎంత మాత్రం చెడగొట్టమన్నాడు. కానీ ఈ ‘జంబలకిడి పంబ’ చూస్తున్నంతసేపూ శ్రీనివాసరెడ్డి ఏం నచ్చి ఈ సినిమా చేశాడో అన్న సందేహాలు వెంటాడుతుంటాయి. ‘జంబలకిడి పంబ’లో పదో వంతు కూడా ఇందులో నవ్వులు పండలేదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు. అబ్బాయి అమ్మాయిగా.. అమ్మాయి అబ్బాయిగా మారిపోవడం అనే పాయింట్ తప్పితే ఈవీవీ క్లాసిక్ కు.. దీనికి అసలు పోలికన్నదే లేదు. నవ్వుల కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టేసింది ఇందులో.
పాత ‘జంబలకిడి పంబ’లో తెరమీద కనిపించే పాత్రలన్నింటి అవతారాలూ మారిపోతాయి. హైడోస్ ఎంటర్టైన్మెంట్ తో కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి అన్ని పాత్రలూ. ఇక్కడ రూపం మారేది హీరో హీరోయిన్లకు మాత్రమే. కానీ వాళ్లిద్దరూ సైతం నవ్వులు పండించలేకపోయాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న శ్రీనివాసరెడ్డి అమ్మాయి అవతారంలో చెలరేగిపోతాడేమో అనుకుంటాం. కానీ ఆరంభంలో అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ను అనుకరిస్తూ కొంత ఆసక్తి రేకెత్తించినా.. ఆ తర్వాత అతడి పాత్ర చాలా సాధారణంగా మారిపోతుంది. రిపిటీటివ్ గా అనిపించే హావభావాలు.. సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది అతడి పాత్ర. శ్రీనివాసరెడ్డే ఏమీ చేయలేకపోయినపుడు ఒక కొత్తమ్మాయి అయిన కథానాయిక మాత్రం ఏం చేస్తుంది? జెన్యూన్ లాఫ్ మూమెంట్స్ కు అవకాశమే లేని పాత్రలు.. సన్నివేశాలతో పూర్తిగా నిరాశ పరిచాడు దర్శకుడు జె.బి.మురళీకృష్ణ.
‘జంబలకిడి పంబ’ అనే టైటిల్.. అబ్బాయి అమ్మాయిగా.. అమ్మాయి అబ్బాయిగా మారడం అనే కాన్సెప్ట్.. చిత్ర బృందం మొత్తం ఇవి రెండూ చూసి ఎగ్జైట్ అయి సినిమా చేసేసినట్లుగా అనిపిస్తుంది. నిజానికి కాన్సెప్ట్ ప్రకారం చూస్తే నవ్వించడానికి బాగానే స్కోప్ ఉంది. కానీ ఫన్ జనరేట్ చేయడానికి అవసరమైన మేరకు కథా విస్తరణ జరగలేదు. సన్నివేశాలన్నీ పేలవంగా తయారయ్యాయి. అసలు పాయింట్లోకి రావడానికి ముందు ప్రథమార్ధమంతా కూడా చాలా పేలవంగా తయారైంది. హీరో హీరోయిన్ల నేపథ్యం.. వాళ్ల మధ్య గొడవలు అన్నీ కూడా చాలా సాధారణంగా కనిపిస్తాయి. పోసాని.. వెన్నెల కిషోర్ లాంటి వాళ్లున్నా కూడా కామెడీ జనరేట్ కాలేదంటే అది దర్శకుడి వైఫల్యమే.
విరామం ముంగిట ఇద్దరి రూపాలు మారే సన్నివేశం దగ్గర మాత్రమే ఆసక్తి కలుగుతుంది. ఇక ద్వితీయార్దంలో అయినా కామెడీ పండుతుందేమో అనుకుంటే.. నిరాశ తప్పదు. రూపాలు మారాక అబ్బాయి కష్టం అమ్మాయికి.. అమ్మాయి కష్టం అబ్బాయికి తెలిసి ఇద్దరూ ఒక్కటవుతారన్న విషయం ముందే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ఇక స్క్రీన్ ప్లే పరంగా ఏ మెరుపులు కానీ.. కామెడీ వర్కవుటయ్యే సన్నివేశాలు కానీ పెద్దగా లేకపోవడంతో ద్వితీయార్దం కూడా భారంగానే తయారవుతుంది. శ్రీనివాసరెడ్డి.. పోసాని.. వెన్నెల కిషోర్ అక్కడక్కడా కొన్ని కామెడీ చమక్కులతో కొంత నవ్వించారు తప్పిస్తే.. ఈ టైటిల్.. శ్రీనివాసరెడ్డి రెపుటేషన్ ఆధారంగా పెట్టుకున్న అంచనాలకు మాత్రం ‘జంబలకిడి పంబ’ ఎంతమాత్రం రీచ్ కాదు.
నటీనటులు:
శ్రీనివాసరెడ్డి ఎప్పట్లాగే శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. అమ్మాయిగా మారాక అతడి హావభావాలు ఆకట్టుకుంటాయి. కానీ అతను తనదైన శైలిలో కామెడీ పండించడానికి ఈ పాత్ర స్కోప్ ఇవ్వలేదు. హీరోయిన్ సిద్ధి ఇద్నానీకి శ్రీనివాసరెడ్డితో జోడీ కుదరలేదు. గ్లామర్ పరంగా ఆమె అంతగా ఆకట్టుకోదు. ఆ అమ్మాయి నటన ఆద్యంతం ఒకేరకంగా అనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డిలా పాత్రలో మార్పుకు తగ్గట్లుగా ఆమె వైవిధ్యం చూపించలేకపోయింది. పోసాని కృష్ణమురళికి చాలా పెద్ద పాత్రే దొరికింది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆ పాత్ర మామూలుగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కూడా స్థాయికి తగ్గట్లు నవ్వించలేదు. హరితేజ పర్వాలేదు. సత్యం రాజేష్.. రఘుబాబు.. తనికెళ్ల భరణి.. వీళ్లెవ్వరినీ సరిగా ఉపయోగించుకోలేదు.
సాంకేతివర్గం:
ప్రేమకథలకు మంచి ఫీల్ తో మ్యూజిక్ చేసే గోపీసుందర్.. ఈ చిత్రానికి మిస్ ఫిట్ అనిపిస్తాడు. పాటలేవీ అంత ప్రత్యేకంగా అనిపించవు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా అనిపిస్తుంది. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రచయిత.. దర్శకుడు జె.బి.మురళీ కృష్ణలో కామెడీ సినిమాను డీల్ చేసే సత్తా లేకపోయింది. అసలు ఈ తరం ప్రేక్షకుల అభిరుచినే అతను పట్టుకోలేకపోయాడు. సటిల్ కామెడీని ఇష్టపడుతున్న ఇప్పటి ప్రేక్షకులకు ఇలాంటి లౌడ్ కామెడీ ఎక్కట్లేదు. ఆ తరహా కామెడీని ఇష్టపడే వాళ్లను కూడా మెప్పించేలా సినిమా తెరకెక్కలేదు. రైటింగ్ దగ్గరే సినిమా గాడి తప్పింది. కాబట్టే శ్రీనివాసరెడ్డి సహా చాలామంది కమెడియన్లున్నా నవ్వులు పండలేదు.
చివరగా: జంబలకిడి పంబ.. బొమ్మ తిరగబడింది
రేటింగ్-1.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre