Begin typing your search above and press return to search.
మన బ్లాక్ బస్టర్ 22 ఏళ్లకు బాలీవుడ్ లోకి
By: Tupaki Desk | 27 Sep 2015 5:30 PM GMTటాలీవుడ్ కామెడీ బ్లాక్ బస్టర్ల లిస్టు తీస్తే ‘జంబలకిడి పంబ’ కచ్చితంగా నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తుంది. 90ల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం. మగాళ్లు ఆడాళ్లుగా - ఆడాళ్లు మగాళ్లుగా మారిపోయే ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసింది. వేరే భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు. ఈవీవీ తీసిన ఈ కామెడీ క్లాసిక్ 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ‘మ్యాన్స్ వరల్డ్’ పేరుతో హిందీలోకి రీమేక్ చేసింది.
పరిణీతి చోప్రా - కల్కి కొచ్లిన్ - రియా చక్రవర్తి - రిచా చద్దా - ప్రీతిష్ నంది తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విక్రమ్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోస్టరే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మనకు సల్మాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ గురించి తెలుసు. కానీ ఈ పోస్టర్ లో ‘ఏక్ థా టైగ్రెస్’ అన్న పోస్టర్ కనిపిస్తోంది. మగాళ్లు అమాయకంగా.. ఆడవాళ్లు పోకిరీలుగా కనిపిస్తుంటే హీరో ఆ ప్రపంచం చూసి దిమ్మదిరిగిపోయి గావు కేకలు పెడుతున్నాడు. ఈ మంగళవారమే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్ కాబట్టి.. ‘జంబలకిడి పంబ’ హిందీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదు.