Begin typing your search above and press return to search.

89 ఏళ్ళ జేమ్స్ బాండ్ చనిపోయాడు

By:  Tupaki Desk   |   23 May 2017 5:57 PM GMT
89 ఏళ్ళ జేమ్స్ బాండ్ చనిపోయాడు
X
హాలీవుడ్ సినిమాల్లోని సూపర్ హీరోస్ రోల్స్ అన్నీ ఒకెత్తయితే.. బ్రిటీష్‌ వారు తీసే ''జేమ్స్ బాండ్'' సినిమాలు మరో ఎత్తు. ఇకపోతే సదరు పాత్రను వెండితెరపై పోషించిన అనేకమంది నటుల్లో.. రోజర్ మూర్ కు ఉన్న రేంజే వేరు. మనోడు మోస్ట్ హ్యాండ్సమ్ బాండ్ గా ప్రసిద్ది చెందాడు. ఈ బాండ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. 89 ఏళ్ళ రోజర్ మూర్ గత కొంత కాలంగా క్యాన్సర్ బో బాధపడుతూ.. గత సాయంత్రం స్విట్జర్ ల్యాండ్ లో మరణించాడు.

జేమ్స్ బాండ్ సినిమాలతోనే కాకుండా.. ది సెయింట్.. ది పెర్సుయేడర్ వంటి టివి షోలతో కూడా రోజర్ మూర్ చాలా పాపులర్ అయ్యాడు. 1927లో లండన్ లో జన్మించిన్ రోజర్.. చాలాకాలం టివి సీరియల్స్ లో నటుడిగా పనిచేసి.. 1973లో 'లివ్ అండ్ లెట్ డై' అనే జేమ్స్ బాండ్ సినిమాతో బాండుగా తన ప్రభంజనం మొదలెట్టాడు. ఆ తరువాత 12 ఏళ్ళపాటు 6 బాండ్ సినిమాల్లో 007గా తన సత్తా చాటాడు. 1985లో 58 ఏళ్ళ రోజర్ మూర్ తన చివరి బాండ్ సినిమా చేసి ఆ రోల్ నుండి రిటైర్డ్ అయ్యాడులే.

రోజర్ మూర్ కు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అత్యంత ఎక్కువ బాండ్ సినిమాలు చేసిన నటుడిగా ప్రసిద్ది చెందిన రోజర్ మూర్ కు బ్రిటీష్‌ ప్రభుత్వం అత్యం ప్రతిష్టాత్మకమైన 'సర్' పురస్కారం 1999లో అందజేసింది. ఆయన 1991లో యునిసెఫ్‌ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికచేయబడ్డారు. ఈ సందర్భంగా అశేష బాండ్ అభిమానులకు సంతాపం తెలియజేద్దాం.