Begin typing your search above and press return to search.

అవతార్ 4.. అవతార్ 5 సిరీసులపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 PM GMT
అవతార్ 4.. అవతార్ 5 సిరీసులపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!
X
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. 2009లో విడుదలైన 'అవతార్' పార్ట్-1 ప్రేక్షకులకు సరికొత్త ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. గ్రాఫిక్స్ పనితనానికి ఈ మూవీ ఒక మచ్చుతునకగా నిలిచింది. అవతార్ తొలి పార్ట్ ను దర్శకుడు జేమ్స్ కామెరూన్ 234 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.924 బిలియన్ డాలర్లను వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా విడుదల సమయంలో జేమ్స్ కామెరూన్ 'అవతార్'కు నాలుగు సిక్వెల్స్ ఉంటాయని స్పష్టం చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత అవతార్ పార్ట్ 2 రాబోతుంది. 2022 డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

'Avatar: The Way of Water' పేరుతో 'అవతార్-2' మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ చూశాక ఈ సినిమాను బిగ్ స్క్రీన్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠను అభిమానుల్లో కలిగించింది. అయితే తాజాగా 'అవతార్ 4'.. 'అవతార్ 5' సిరీసులపై దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.

'అవతార్' పార్ట్ 1 విడుదల సమయంలో దర్శకుడు కామెరూన్ ఈ మూవీకి ఐదు సిరీసులు తీసుక రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన వద్ద స్క్రీప్ట్ సైతం ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అవతార్ 2 ఈ ఏడాది డిసెంబర్ 16న రాబోతుంది. అలాగే అవతార్ పార్ట్ 3 మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలోనే 'అవతార్ 2' మూవీకి అభిమానుల నుంచి వచ్చే స్పందనను బట్టి 'అవతార్ 3'తో సినిమా ముగించాలా? లేదా కొనసాగించాలా? అనేది క్లారిటీ వస్తుందని జేమ్స్ కామెరూన్ స్పష్టం చేశారు. తాను ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పటికీ నేటికీ ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయని జేమ్స్ కామెరూన్ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే 'అవతార్ 2'.. 'అవతార్ 3' సినిమాలు రాబట్టే కలెక్షన్లను బట్టి తదుపరి సిరీసులు ఉంటాయని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. అవతార్ మూవీ పూర్తిగా విభిన్న సబ్జెక్టుతో తెరకెక్కినప్పటికీ పార్ట్ 2, పార్ట్ 3 మార్కెట్ మీదనే తదుపరి సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.

'అవతార్'కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా 'అవతార్ 2'.. 'అవతార్ 3' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో 'అవతార్ 4'.. 'అవతార్ 5' సిరీసులను కూడా తెరక్కెక్కడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచ సినిమా చరిత్రలో 'అవతార్' ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.