Begin typing your search above and press return to search.
క్రిస్మస్ కి అవతార్ 2 ఫిక్స్
By: Tupaki Desk | 27 Dec 2015 7:30 AM GMTఆరేళ్ల క్రితం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన అవతార్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. వేరే గ్రహం మీదకు భూ ప్రజలు దాడి చేసే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. హాలీవుడ్ సినిమాల రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసింది. గ్రాఫిక్ మాయాజాలమే అయినా.. ఇంతవరకూ ఎవరూ తీయలేనంత అద్భుతంగా ప్రకృతి అందాలను గ్రాఫిక్స్ లో చూపించారనే ప్రశంసలు దక్కించుకుంది.
2009లో రిలీజ్ అయిన అవతార్ కు.. ఇప్పుడు సీక్వెల్ సిద్ధం అవుతోంది. ఇఫ్పటికే అవతార్ 2కు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జేమ్ కేమరాన్ స్వయంగానే వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో అవతార్ కొనసాగింపు విషయాన్ని చెప్పాడు జేమ్స్. ప్రస్తుతం కాస్టింగ్ వర్క్స్ అన్నీ పూర్తయిపోగా.. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ మూవీ చిత్రీకరణకు ఏడాదిన్నర పైగా సమయం పడుతుందని తెలుస్తోంది.
2016 ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టి.. 2017 ఆగస్ట్, సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. అలాగే అవతార్ మొదటి భాగం మాదిరిగానే, అవతార్2ని కూడా క్రిస్మస్ సమయానికే రిలీజ్ చేయనున్నారు. అంటే 2017 క్రిస్మస్ కి అవతార్ సీక్వెల్ విడుదల కానుందన్నమాట. తొలి భాగానికి 3డీ వెర్షన్ ను తర్వాత రిలీజ్ చేయగా.. అవతార్ 2కి మాత్రం ఒకేసారి 3డీ వెర్షన్ విడుదల చేయాలని నిర్ణయించారు.