Begin typing your search above and press return to search.

సూపర్ హీరో సినిమాలపై జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 10:30 AM GMT
సూపర్ హీరో సినిమాలపై జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యలు..!
X
ప్రపంచ సినీ ప్రేమికులకు జేమ్స్ కామెరాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏళ్లకు తరబడి ఆయన సినిమాల కోసం ఎదురుచూసినా సరే ఇలాంటి సినిమా కోసం ఎన్నేళ్లయినా నిరీక్షణ అవసరమే అనిపించేలా వెండితెర మీద అద్భుతమైన మ్యాజిక్ చేస్తాడు.

టైటానిక్, అవతార్ సినిమాలతో ప్రపంచ సినీ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరాన్. ప్రస్తుతం అవతార్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు జేమ్స్ కామెరాన్. డిసెంబర్ లో అవతార్ 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ ఎన్నో భారీ అంచనాలతో వస్తుంది. రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు మరింత పెంచింది.

2009 లో వచ్చిన అవతార్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ పై కూడా అవతార్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమా పార్ట్ 2 కోసం ప్రపంచ సినీ ప్రేక్షకులతో పాటుగా ఇండియన్ ఆడియన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఇక అవతార్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు జేమ్స్ కామెరాన్. ఈ ఇంటర్వ్యూలో మార్వెల్, డీసీ మూవీస్ పై తన మార్క్ పంచ్ వేశారు జేమ్స్ కామెరాన్. సూపర్ హీరోల సినిమాల్లో పాత్రలు ఎంత పెద్ద వైనా సరే కాలేజ్ లో ఉన్నట్టుగా ప్రవర్తిస్తాయని అన్నారు జేమ్స్ కామెరాన్. అంతేకాదు ఈ పాత్రల మధ్య సంబంధాలు ఉన్నా వాటిని కొనసాగించలేకపోయారని అన్నారు. హంగు ఆర్భాటాలతో భారీ స్థాయిలో ఆ సినిమాలు ఉంటున్నా పాత్రల మధ్య సంబంధాలు వాస్తవానికి దగ్గరగా ఉండవని ఆ విషయంలో ఆ సూపర్ హీరో సినిమాలు విఫలమవుతున్నాయని కామెరాన్ అన్నారు.

అసలు సినిమాలు తీయడం అలా కానే కాదంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కామెరాన్. ఏమాట కామాట చెప్పుకోవాలంటే ఎంత పెద్ద భారీ స్థాయిలో సినిమాలు తీసినా సరే జేమ్స్ కామెరాన్ సినిమాల్లో క్యారక్టర్స్ మధ్య రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆ రిలేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తారు జేమ్స్ కామెరాన్. అవతార్ 2 కోసం ప్రపంచమంతా చాలా ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఈ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలను అందుకుని వరల్డ్ సినిమాకు కొత్త కళ తెచ్చేలా అవతార్ 2 ని తీర్చిదిద్దుతున్నారు ఈ దర్శకుడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.