Begin typing your search above and press return to search.

'అవ‌తార్-2' మ‌రో సంచ‌ల‌నం అవుతోంద‌న్న జేమ్స్ కామెరూన్!

By:  Tupaki Desk   |   27 Oct 2022 11:30 PM GMT
అవ‌తార్-2 మ‌రో సంచ‌ల‌నం అవుతోంద‌న్న జేమ్స్ కామెరూన్!
X
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్-2'-' ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న విజువల్ వండర్ ఇది. దశాబ్ధ కాలంగా ప్రేక్షకాభిమానులు ఎంతో ఎగ్జటైమెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది. మరో రెండు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో అంచనాలకు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.

కామెరూన్ ఎలాంటి విజువల్ ట్రీట్ ని అందించబోతున్నారు? అన్న ఉత్సాహం ఉరకలేస్తుంది. ది వే ఆఫ్ వాటర్ లో ఎంతటి అద్భుత సృష్టికి తెర తీసారు? అంటూ ఒకే చర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినిమా గురించి కామెరూన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మార్వెల్..డీసీ ప్రాంచైజీ చిత్రాల్లోని పాత్ర‌ల్లో లేని ప‌రిప‌క్వ‌త నా రాబోయే అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ పాత్ర‌ల్లో ఉంటాయి.


గ‌తంలో మార్వెల్..డిస్నీ నుంచి వ‌చ్చిన సూప‌ర్ హీరోల చిత్రాల‌పై కొన్ని ర‌కాల విమర్శ‌లొచ్చాయి. ఆయా సినిమాల్లో పాత్ర‌ల మ‌ధ్య సంబంధాలుంటాయి కానీ వాస్త‌వికంగా అనిపించ‌వు. ఏదో వారంతా క‌ళాశాల‌లో ఉన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తార‌ని విమ‌ర్శించారు. అలా సినిమాలు తీయ‌డం స‌బ‌బు కాదు. తీసే సినిమా అర్ధ‌వంతంగా ఉండాలి. అర్ధ‌వంతంగా ఉంది అని త‌ప్పుడు భావ‌న‌ను వీడ‌నాడాలి.

అప్పుడే మంచి సినిమాలు చేయ‌గ‌లం. అవ‌తార్ సీక్వెల్ లో వ‌ర్తింగ‌ట్..జో సుల్తానా పోషించిన జాక్..నేయిత్రి పాత్ర‌లు త‌మ కుటుంబాన్ని సుర‌క్షితంగా ఉంచ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ‌తాయ‌ని చూస్తారు. మార్వెల్..డిస్నీ ప్రాంచైజీ చిత్రాల్లో పాత్ర‌ల్లో లేని ప‌రిప‌క్వ‌త‌ను జేక్..నేయిత్రి మ‌ధ్య చూస్తార‌ని ` ధీమా వ్య‌క్తం చేసారు.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. కామెరూన్ త‌న సినిమా గొప్పత‌నం కోసం ఇత‌ర చిత్రాల్ని త‌క్కువ చేసి మాట్లాడటం భావ్యం కాదంటూ నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి వీటిపై హాలీవుడ్ దిగ్గ‌జాలు ఎలాంటి బ‌దులిస్తారో చూడాలి. డిస్నీ..మార్వెల్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.