Begin typing your search above and press return to search.
చిరుకు చెప్పా వినిపించుకోలేదు - పవన్ కూడా..!
By: Tupaki Desk | 30 Dec 2018 3:46 PM GMTసినీ తారలు ఒకప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి మంచి చేశారని, తమ గౌరవంను కాపాడుకున్నారని - కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని - ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వారు రాజకీయాలకు చాలా దూరంగా ఉండటం గౌరవప్రథమని సీనియర్ హీరోయిన్ జమున అన్నారు. తాను అప్పట్లో ఇందిరా గాంధీ - రాజీవ్ గాంధీ గార్ల కోరిక మేరకు రాజమండ్రి నుండి పోటీ చేసి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాను. అప్పుడు నాకు చాలా గౌరవం దక్కేది. నేను అనుకున్నట్లుగా నియోజక వర్గం అభివృద్దికి తోడ్పాటును అందించారు.
ఇప్పుడు రాజకీయాలు కుళ్లుగా మారిపోయాయి. కోటి ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి పది కోట్లు సంపాదించానేది నాయకుల కోరికగా ఉందని - ఎవరైనా సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్లే వారిని కూడా ప్రజలు అలాగే చూస్తున్నారు. అందుకే గతంలో చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం జరుగుతున్న సమయంలో నేను వద్దని చెప్పాను. ఈ రాజకీయాలు మనకు సెట్ అవ్వవు అంటూ చిరంజీవితో చెప్పాను. అప్పుడు ఆయన నవ్వుతూ ఊరుకున్నాడు.
చిరంజీవికి నేను చెప్పినట్లుగానే ఆయన రాజకీయాల్లో సెట్ కాలేక పోయాడు. రాజకీయాల గురించి సినిమా ఇండస్ట్రీ వారు మర్చి పోవడం బెటర్. ఎందుకంటే సినిమా వారిని ప్రేక్షకులు దేవుళ్లుగా పూజిస్తారు. అదే జనాలు సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం హీనంగా చూస్తారు. చిరంజీవి పరిచయం ఉండటం వల్ల నేను రాజకీయాలు వద్దని చెప్పాను, కాని పవన్ తో నాకు పరిచయం లేదు, కాబట్టి నేను ఆయనకు సలహా ఇవ్వలేను అన్నాడు. సినిమా వారు సినిమాల్లో ఉంటేనే గౌరవం అంటూ తన ఉద్దేశ్యంను చెప్పుకొచ్చారు.