Begin typing your search above and press return to search.
మహానటి నాకు చెప్పి తీయలేదు
By: Tupaki Desk | 19 Feb 2018 6:11 AM GMTతెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రేక్షకుల హృదయాల్లో చెక్కు చెదరని సింహాసనాన్ని అధీష్టించిన మహానటి సావిత్రి ఆత్మకథను సినిమాగా మలిచే సాహసాన్ని దర్శకుడు నాగ అశ్విన్ తలకెత్తుకుని దాదాపు పూర్తి చేసే స్టేజికి వచ్చేసాడు. కాని ఇంకా విడుదల తేది ఖరారు కాకముందే అతనికి పెను సవాళ్ళు ప్రశ్నలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సావిత్రి గారు ఎంత గొప్ప నటి అయినప్పటికీ ఆవిడ వ్యక్తిగత వైవాహిక జీవితం చాలా ఒడిదుడుకులతో కూడుకుంది. అంత సిరిసంపదలు ఉన్నా కూడా చివరి రోజుల్లో ఎవరు లేని దానిలా ఎందుకు కాలం చేసారు అనేది ఇప్పటికీ శేష ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో సావిత్రిగారికి అత్యంత సన్నిహితురాలిగా భావించే నటి జమునగారు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెకెత్తించిన ప్రశ్నలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. తన స్వంత కుటుంబ సభ్యురాలిగా ఎంతో ప్రేమగా అక్కా అని పిలుచుకునే సావిత్రి గురించి తనకంటే ఎవరికి ఎక్కువ తెలియదని, కనీసం తనను సంప్రదించకుండా సినిమా ఎలా తీస్తారని ఆవిడ ప్రశ్నిస్తున్నారు.
సావిత్రి జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న సమయంలో అతనికి అమ్మాయిల పట్ల ఉండే అభిప్రాయాల గురించి ఎంత చెప్పినా వినలేదని, నమ్మి మోసపోయిందని చెప్పిన జమున ఇలాంటి సంగతులు పూర్తిగా తెలుసుకునే సినిమా తీస్తున్నారా అని అడుగుతున్నారు. కోట్ల విలువ చేసే భవంతులు, ఆస్తులు ఉన్న సావిత్రి మద్యానికి బానిసై అనాధలా మరణం కొని తెచ్చుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను సావిత్రిని అమెరికా చికిత్స కోసం పంపాలనే ప్రయత్నం ఆవిడ అనారోగ్యం వల్ల విఫలం కావడాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. సావిత్రి ఉన్న రోజుల్లో చాలా చనువుగా వాళ్ళలో ఇప్పటికీ బ్రతికి ఉన్న నన్ను సంప్రదించకుండా ఆ దర్శకుడు ఎలా తీస్తున్నారో అర్థం కావడం లేదని చురక వేసారు. పైగా బాష రాని వాళ్ళు సావిత్రిగా నటించడం పట్ల కూడా ఆవిడ ఆక్షేపించారు.
అసలు ట్విస్ట్ ఏంటంటే ఇందులో జమున గారి పాత్ర కూడా ఉందని, అది శాలిని పాండే వేసిందని ఇప్పటికే వార్త ప్రచారంలో ఉంది. అసలు నాగ అశ్విన్ తనను కలవనే లేదు అంటున్న జమున గారు తనకు చెప్పకుండా సినిమాలో తన పాత్రను పెట్టారు అని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారో చూడాలి. నాగ అశ్విన్ ముందు నుంచి తాను సావిత్రి జీవిత కథను అధ్యయనం చేసానని, అందరికి కలిసే ఎన్నో వివరాలు సేకరించానని చెబుతూనే ఉన్నాడు. మరి జమున గారు చెప్పిన ప్రకారం కలవలేదు అంటున్నారు. మరి దీని గురించి క్లారిటీ రావాలంటే నాగ అశ్విన్ చెప్పాల్సిందే. మార్చ్ 29అని గతంలో ప్రకటించిన డేట్ కి మహానటి రావడం అనుమానంగానే ఉంది. యూనిట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్ డేట్స్ రావడం లేదు .