Begin typing your search above and press return to search.

మన వకీల్‌ సాబ్ కు సరిగ్గా సూట్‌ అయ్యే 'జనగణమన'

By:  Tupaki Desk   |   5 Jun 2022 4:30 PM
మన వకీల్‌ సాబ్ కు సరిగ్గా సూట్‌ అయ్యే జనగణమన
X
కాన్సెప్ట్‌ బేస్డ్ సినిమాల విషయంలో సౌత్‌ ఇండియా నుండి మలయాళం సినిమాలు ముందు ఉంటాయి. హీరోయిజం.. రొమాంటిక్‌ లవ్ స్టోరీలు చూపించే సినిమాల కంటే ఒక మంచి కాన్సెప్ట్‌ ను తీసుకుని హీరోయిజం తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం లో మలయాళం సినీ మేకర్స్ ముందు ఉంటున్నారు. ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలనే అభిప్రాయం ఉండేది.

ఇప్పుడు మాత్రం మలయాళం సినిమాలంటే చాలా గౌరవం అన్ని భాషల వారికి కూడా ఉంటుంది. ఈమద్య కాలంలో ఎన్నో మలయాళం సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. ఇటీవల పవన్‌ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఇంకా పలు మలయాళం సినిమాలను రీమేక్‌ చేయడం కోసం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా విడుదల అయిన జనగణమన సినిమా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మమత మోహన్ దాస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా లో పృథ్వీరాజ్ మరియు సూరజ్ కీలక పాత్రల్లో కనిపించారు. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం అల్లర్లు సృష్టించడం... యూత్‌ ను రెచ్చగొట్టడం.. మీడియా ద్వారా జనాలను తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమా లో పృథ్వీ రాజ్ లాయర్ పాత్రలో నటించాడు. ఆ పాత్రకు పవన్ కళ్యాణ్ బాగా సెట్‌ అవుతాడని.. ఈ సినిమా రీమేక్ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ఒక సారి ఆలోచించాలంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు అన్ని సౌత్‌ భాషల్లో మరియు హిందీలో కూడా స్ట్రీమింగ్‌ అవుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అత్యధిక జనాలు చూస్తున్న సినిమా గా జనగణమన సినిమా నిలిచిందంటూ ఇటీవలే నెట్‌ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించారు. జనగణమన సినిమాకు కాస్త తెలుగు నేటివిటీని జోడించి కమర్షియల్‌ హంగులకు పోకుండా పవన్‌ ఈ సినిమాను చేస్తే ఖచ్చితంగా ఒక అద్బుతమైన తెలుగు సినిమా గా నిలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.