Begin typing your search above and press return to search.
జనసేన జెండాతో చిరును ఇబ్బందిపెట్టేశారు
By: Tupaki Desk | 7 Jan 2017 4:14 PM GMTఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారే.. ఇప్పుడు హాయ్ ల్యాండ్ లో కూడా తమ టాలెంట్ చూపించేశారు. ఒక ప్రక్కన స్వయంగా పవన్ కళ్యాణ్ ''ఖైదీ నెం 150'' సినిమాకు విషెస్ తెలిపినప్పటికీ.. కొందరు అభిమానులు మాత్రం పవర్ స్టార్ అని అరుస్తూ ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హంగామా చేశారు.
విశేషం ఏంటంటే.. అది ఓపెన్ ప్లేస్ కావడంతో.. ఎవరు ఎంతగా పవర్ స్టార్ అని అరిచినా కూడా అక్కడ ఎవ్వరికీ వినిపించదు. దానితో కొందరు జనసేన జెండాను తీసుకొచ్చేసి.. ఈ ఈవెంట్లో ఊపడం మొదలెట్టారు. ఎక్కడో దూరంగా ఊపుతున్నంతసేపూ బాగానే ఉంది.. కాని ఒక యువకుడు మాత్రం ఏకంగా స్టేజ్ కు దగ్గరగా వచ్చేసి.. చిరంజీవి ముఖం ఎవ్వరికీ కనిపించడకుండా.. కెమెరాలకు అడ్డొచ్చేలా జెండా ఊపడం స్టార్ట్ చేశాడు. దానితో చిరంజీవి తన స్పీచ్ ఆపేసి.. జెండా కిందకు దించు అంటూ కాస్త సీరియస్ గా ఆదేశించారు. కాసేపు జనసేన జెండాను ఆపేసిన ఆ అభిమాని.. మళ్ళీ ఊపడం మొదలెట్టేశాడు. కట్ చేస్తే.. ఎవరో ఆ జెండా పైకి ఊగకుండా అటూ ఇటూ కాస్త గట్టిగా లాగి పట్టుకోవడంతో.. చిరంజీవి తన స్పీచ్ ను ముగించేసి వెళ్ళిపోయారు.
మొత్తానికి జనసేన జెండాతో చిరంజీవిని అలా ఇబ్బందిపెట్టేశారని వేరే చెప్పక్కర్లేదు. ఏంటో ఈ అభిమానం.. రేపు పవన్ ప్రసంగిస్తున్నప్పుడు జనసేన మీటింగులో ఇలాగే ఎవరైనా కాంగ్రెస్ బిజెపి జెండాలు ఊపితే వీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/