Begin typing your search above and press return to search.
గ్యారేజ్ ఆడియో మీద కోటి పెడుతున్నారు
By: Tupaki Desk | 5 July 2016 4:42 PM GMTమొన్న సమ్మర్ లో వచ్చిన పెద్ద సినిమాలను తీసుకుంటే.. సర్దార్ - సరైనోడు - బ్రహ్మోత్సవం - అ..ఆ - సుప్రీమ్ వంటి పెద్ద బొమ్మలు బాగానే పడ్డాయ్. అయితే వీటిలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన సర్దార్ ఆడియో యావరేజ్ గానే ఉంది. మిగిలిన బొమ్మల పరిస్థితి కూడా అంతేలే. ధియేటర్లలో నుండి సినిమా వెళ్లిపోయాక పాటలు జనాలకు గుర్తులేని పరిస్థితి.
ఇప్పుడు మ్యాటర్ కు వస్తే.. మరికొద్ది రోజుల్లో ''జనతా గ్యారేజ్'' ఆడియో రిలీజవ్వబోతోంది. ఈ ఆడియోపైన ఎక్స్ పెక్టేషన్లు చాలా అధికంగానే ఉన్నాయి. ఎందుకంటే.. గతంలో దేవిశ్రీ-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి అండ్ శ్రీమంతుడు సినిమాల పాటలు సూపర్ హిట్టు అవ్వడమే అందుకు కారణం. ఈ ఏడాదికి గాను గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇదే అవుతుంది అనే టాక్ ఇప్పటికే ఇండస్ర్టీలో వినిపిస్తోందంటే.. ఈ సినిమా పాటలు దేవిశ్రీ ఎలా కొట్టుంటాడో చూస్కోండి. ఈ సినిమా ఆడియో రైట్స్ విషయానికొస్తే.. దాదాపు 1 కోటి రూపాయలకు వాటిని విక్రయించనున్నారట. ఆడియో రైట్లతో పాటు టీజర్లు - ట్రైలర్లు వగైరా డిజిటిల్ ప్రమోషన్ మెటీరియల్ రైట్లు కూడా అదే కంపెనీకి ఇస్తారట. అసలు ఆ ఫిగర్ కు అమ్మడమంటేనే పెద్ద విషయం అంటున్నారు సినిమా అబ్జర్వర్స్.
నిజానికి ఆడియో పరంగా ఫిజికల్ సేల్స్ పెద్దగాలేని ఈరోజుల్లో ఇలా స్టార్ హీరోల సినిమాలకు అంతేసి రేటు పలకడం అంటే మామూలు విషయం కాదు. హీరో తాలూకు స్టార్ పవర్.. డైరక్టర్ తాలూకు టేస్టు.. ఇక మ్యూజిక్ కంపోజర్ క్రియేటివిటీ.. అన్నీ కలిస్తేనే సూపర్ హిట్ ఆల్బమ్. సూపర్ హిట్ రేటు. బాబూ దేవిశ్రీ.. వెయిటింగ్ ఇక్కడ.. త్వరగా ఒక శాంపిల్ వదిలేయ్.