Begin typing your search above and press return to search.

గ్యారేజ్‌ అక్కడ క్లీన్‌ బౌల్డ్ చేసింది

By:  Tupaki Desk   |   19 May 2016 5:30 PM GMT
గ్యారేజ్‌ అక్కడ క్లీన్‌ బౌల్డ్ చేసింది
X
మామూలుగా ఇప్పుడంటే ఫ్లెక్సీ సైన్‌ బోర్డులూ.. ఫోటోషాప్‌ డిజైనింగులు.. రకరకాల తెలుగు ఫాంట్లు వచ్చాయి. కాని ఒకప్పుడు మాత్రం.. ఒక షాప్‌ ముందు బోర్డు అంటే.. దానిని ఒక పెయింటర్‌ చేత రాయించుకోవాల్సి వచ్చేది. క్రియేటివ్‌ గా బోర్డులు రాసే ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉండేవారు. ఇక 1980 నుండి 2000వ సంవత్సరం వరకు.. ఈ కలర్‌ బోర్డులను చూసీ చూసీ పిల్లలు చాలా ఎక్సయిట్‌ అయ్యే ఉంటారు. ఆ తరువాత కంప్లీట్‌ గా వినైల్‌ బోర్డులు.. ఫ్లెక్సీ బోర్డులు వచ్చేశాయి. ఒక్కసారి ''జనతా గ్యారేజ్‌'' సినిమా లోగో చూశాక ఈ టాపిక్‌ మాట్లాడకుండా ఉండలేం.

ఎప్పుడో పాత కాలం గ్యారేజ్‌ అనే ఫీల్‌ క్రియేట్‌ చేయాలని కాబోలు.. దర్శకుడు కొరటాల శివ.. ఈ సినిమా లోగోను ఒక ఆర్టిస్టు రాసిన బోర్డులా డిజైన్‌ చేయించాడు. కాకపోతే ఇచట అన్నీ రిపేర్లు చేయబడును అనే అక్షరాలు మాత్రం.. కంప్యూటర్లు టైప్‌ చేసిన ఫాంట్ అని తెలిసిపోతున్నాయి కాని.. వాటిని కూడా ఆర్టిస్టు రాసిన ఫ్రీ హ్యాండ్‌ రైటింగ్‌ లో డిజైన్‌ చేయించుంటే.. ఇంకా అదిరిపోయేది. ఒక ప్రక్కన ఎన్టీఆర్‌ లుక్‌ ఎలాగో బాగానే ఉంటుంది.. కాని లోగో డిజైన్‌ ఎంత పవర్‌ ఫుల్‌ గా.. సబ్జెక్టుకు దగ్గరగా.. ఉంటుందీ అనేదే ఈరోజుల్లో పోస్టర్లలో ఎక్కువమందికి నచ్చుతోంది. ఆ యాంగిల్‌ లో చూస్తే.. జనతా గ్యారేజ్‌ లోగోకు.. 100కు 100 మార్కులు వేసేయొచ్చు. సినిమా లవర్స్ ను క్లీన్ బౌల్డ్ చేసేసిందంతే.

ఇకపోతే సైడ్‌ లుక్‌ లో అదరగొట్టిన ఎన్టీఆర్‌.. సైడ్‌ బ్యాగ్‌ వేసుకున్న మరో పోస్టర్‌ లో కూడా ఆకట్టుకున్నాడు.