Begin typing your search above and press return to search.

మరో రికార్డుకు అతి చేరువలో జనతా!

By:  Tupaki Desk   |   14 Sep 2016 11:47 AM GMT
మరో రికార్డుకు అతి చేరువలో జనతా!
X
ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జ‌న‌తా గ్యారేజ్‌’ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. రెండోవారం కూడా దుమ్మురేపింది. బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుకుంటోంది. ప‌నిదినాల్లో కూడా థియేట‌ర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయ‌ని ఫిల్మ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక వారాంతాలు - సెల‌వు దినాల్లో క‌లెక్ష‌న్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా విడుద‌లైన మొద‌టివారం వినాయ‌క చ‌వితి సెల‌వు దినాలు క‌లిసి రావ‌డంతో క‌లెన్ష‌న్లు అనుకున్న స్థాయికంటే ఎక్కువ‌గానే వ‌చ్చాయి. రెండోవారం కూడా వ‌రుస‌గా సెల‌వు దినాలు రావ‌డం జ‌న‌తాకి క‌లిసి వ‌చ్చిన విషయం. సెప్టెంబ‌ర్ 13న బక్రీద్ పండుగ సెల‌వు దినం కావ‌డంతో అన్ని చోట్లా జ‌న‌తా క‌లెక్ష‌న్లు బాగున్నాయ‌ని రిపోర్టులు వ‌స్తున్నాయి.

ఇక‌, సెప్టెంబ‌ర్ 15 నాడు హైద‌రాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల్లో అధికారికంగా సెల‌వు దినం ప్ర‌క‌టించింది తెలంగాణ ప్ర‌భుత్వం. వినాయ‌క నిమ‌జ్జ‌నం రూపంలో మ‌రో సెల‌వు రోజు జ‌న‌తాకి క‌లిసి వ‌చ్చింద‌న్న‌మాట‌! నిమ‌జ్జ‌నం రోజు హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌న‌తా క‌లెక్ష‌న్లు భారీగానే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో క‌లెక్ష‌న్ల ప‌రంగా జ‌న‌తా గ్యారేజ్ రూ. 75 కోట్ల క్ల‌బ్బులోకి చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే లెక్క‌న మూడో వారం ముగిసేస‌రికి జ‌న‌తా గ్యారేజ్ వ‌సూళ్లు రూ. 80 కోట్లు దాటేస్తుంద‌ని ఓ అంచ‌నా.

ప్రాంతాల వారీగా 13 రోజుల్లో జ‌న‌తా వ‌సూళ్లు (షేర్‌) ఇలా ఉన్నాయి.

నిజాం : రూ. 16.72 కోట్లు
సీడెడ్ : రూ. 10.20 కోట్లు
ఉత్త‌రాంధ్ర : రూ. 6.77 కోట్లు
గుంటూరు : రూ. 5.32 కోట్లు
కృష్ణా : రూ. 4.00 కోట్లు
ఈస్ట్ : రూ. 4.36 కోట్లు
వెస్ట్ : రూ. 3.75 కోట్లు
నెల్లూరు : రూ. 2.00 కోట్లు

ప్రాంతాల వారీగా చూసుకుంటే సినిమా విడుద‌లైన తొలి 10 రోజుల్లో ఆంధ్రా - నైజాం ప్రాంతాల్లో జ‌న‌తా గ్యారేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ ప్లేస్‌ లో ఉంది. మొత్తం రూ. 53.13 కోట్లు వ‌సూళ్లు చేసింది. ఇక‌, ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసుకుంటే కేవ‌లం ప‌ది రోజుల్లోనే రూ. 72.75 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టుకుంది.