Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. 200 కోట్ల మైలురాయి
By: Tupaki Desk | 21 Sep 2016 5:28 PM GMTకెరీర్ ఆరంభంలో.. 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనత జూనియర్ ఎన్టీఆర్ సొంతం. కానీ తర్వాత బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయాడు తారక్. ఐతే టెంపర్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కాక సీన్ మారింది. తారక్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఇప్పుడు అందరికీ బాగానే అర్థమైంది. ‘నాన్నకు ప్రేమతో సినిమాతో తొలిసారి 50 కోట్ల షేర్ మార్కును అందుకున్న జూనియర్.. ‘జనతా గ్యారేజ్’తో మరిన్ని ఘనతలు సాధించాడు. కొన్ని నాన్-బాహుబలి రికార్డులు ఖాతాలో వేసుకోవడంతో పాటు ఆల్ టైం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో మూడో స్థానానికి దూసుకెళ్లిందీ సినిమా.
తాజాగా ఎన్టీఆర్ ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఒక ఏడాది 200 కోట్ల గ్రాస్ మార్కును హీరో అయ్యాడు. తారక్ లాస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే.. ‘జనతా గ్యారేజ్’ రూ.125 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. రెండు సినిమాలూ కలిపితే ఇప్పటికే లెక్క రూ.215 కోట్లను దాటింది. ‘బాహుబలి’ని మినహాయించి చూస్తే తెలుగులో ఏ హీరో కూడా ఒకే ఏడాది తన సినిమాలతో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయలేదు. ‘జనతా గ్యారేజ్’ ఫుల్ రన్లో రూ.135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా. షేర్ రూ.85 కోట్ల మార్కుకు చేరువగా రావచ్చు. అదే జరిగితే రెండో స్థానంలో ‘శ్రీమంతుడు’ను కూడా దాటేసి నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంటుంది.