Begin typing your search above and press return to search.
టాప్10 లో గ్యారేజ్ కి ప్లేస్ ఖాయమే
By: Tupaki Desk | 25 Aug 2016 5:04 AM GMTటాలీవుడ్ సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అయ్యే ట్రెండ్ ఎప్పుడో మొదలైంది కానీ.. ఆయా ఇండస్ట్రీల్లో స్ట్రయిట్ సినిమాల మాదిరిగా కలెక్షన్స్ రాబట్టడం తక్కువే. ఒక్క కర్నాటకలో మాత్రమే డైరెక్ట్ తెలుగు చిత్రాలకు మార్కెట్ ఉంటుంది. మిగతా అన్ని ఏరియాల బిజినెస్ నామమాత్రమే. కానీ తన డబ్బింగ్ మూవీస్ తో మలయాళంలో అక్కడి సినిమాలకు సమానంగా వసూళ్లు సాధించే స్థాయికి చేరుకున్నాడు బన్నీ.
తెలుగు నుంచి డబ్బింగ్ అయి మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమా బాహుబలి. ఈ చిత్రానికి 14.25 కోట్లు 'గ్రాస్' వసూళ్ళు దక్కాయి. ఇది కాక మిగిలినవన్నీ బ్రాండ్ బన్నీకే సొంతం. రెండో ప్లేస్ లో యోధావు(సరైనోడు) 7.60 కోట్లు రాబట్టగా.. మూడో స్థానంలో రుద్రమదేవికి 4.65 కోట్ల వసూళ్లు దక్కాయి. నాలుగో ప్లేస్ లో సన్నాఫ్ సత్యమూర్తి 3 కోట్లు కొల్లగొట్టగా ఐదో స్థానంలో లక్కీ ది రేసర్(రేసుగుర్రం) 2.56 కోట్లు సాధించాడు. ఆరో స్థానంలో బద్రీనాథ్ కు 2.35 కోట్లు - ఏడో స్థానంలో ఆర్య-2కి 1.93 కోట్లు - ఎనిమిదో స్థానంలో భయ్యా.. మై బ్రదర్(ఎవడు) 1.60 కోట్లు రాబట్టగా.. తొమ్మిదో స్థానంలో ఉన్న ధీర: ది వారియర్(మగధీర) 1.45 రాబట్టాడు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ సమర్పించినట్లుగానే రిలీజ్ చేశారు.
ఇక పదో స్థానంలో ఉన్న గజపోకిరి (జులాయి) 1.25 కోట్లు సాధించింది. అయితే.. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు జనతా గ్యారేజ్ గ్రాండ్ ఇవ్వడం ఖాయంగా చెప్పచ్చు. మలయాళ వెర్షన్ ను భారీగా రిలీజ్ చేయడంతో పాటు.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు పలువురు కేరళ యాక్టర్స్ తో నటింపచేయడం ప్లస్ కానుంది. మొత్తం మీద మలయాళంలో సత్తా చాటనున్న తెలుగు హీరోగా ఎన్టీఆర్ అవతరించడం ఖాయమే.