Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు మళ్లీ అదే కష్టం
By: Tupaki Desk | 12 Sep 2016 3:30 PM GMTఅమెరికాలో ప్రిమియర్లతో కలిపి రెండు రోజుల్లోనే మిలియన్ మార్కును అందుకుంది ‘జనతా గ్యారేజ్’. వీకెండ్ అయ్యేసరికే 1.5 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. దీంతో 2 మిలియన్ మార్కును అలవోకగా అందుకుంటుందని.. 2.5 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరినా ఆశ్చర్యం లేదని అనుకున్నారంతా. ఫస్ట్ వీకెండ్ తర్వాత గ్యారేజ్ జోరు బాగా తగ్గిపోయింది. వీకెండ్లో సైతం సినిమా పుంజుకోలేదు. టికెట్ల రేట్లు తగ్గించినా ఆక్యుపెన్సీ పెద్దగా పెరిగినట్లు లేదు. రెండో వీకెండ్లో మూడు రోజులకు కలిపి ఈ సినిమా 1.2 లక్షల డాలర్లే వసూలు చేసింది. శుక్రవారం 31 వేల డాలర్లు వస్తే.. శనివారం 71 వేల డాలర్లొచ్చాయి. ఆదివారం కేవలం 18 వేల డాలర్లకే వసూళ్లు పరిమితమయ్యాయి.
మొత్తంగా ఇప్పటిదాకా జనతా గ్యారేజ్ అమెరికాలో 1.72 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇంకా 2.8 లక్షల డాలర్లు వస్తే కానీ 2 మిలియన్ కబ్బు అందదు. సెకండ్ వీకెండ్లో కలెక్షన్లు చూస్తే.. ఆ మార్కును అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆరంభంలో యమ జోరు చూపించింది. తర్వాత 2 మిలియన్ క్లబ్బు అందుకోవడానికి చాలా కష్టపడింది. మూడు వారాల తర్వాత కానీ ఆ మార్కును రీచ్ కాలేదు. చిన్న సినిమానే అయినా ‘జ్యో అచ్యుతానంద’ రెండో వీకెండ్లో ‘జనతా గ్యారేజ్’ను దెబ్బ కొట్టింది. ఐతే తర్వాతి వారం కూడా చిన్న సినిమాలే వస్తుండటం ‘జనతా గ్యారేజ్’కు కలిసొచ్చే అంశం. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని 2 మిలియన్ క్లబ్బులోకి చేరుతుందేమో చూడాలి.