Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్.. హై ప్రైస్ కథ!!
By: Tupaki Desk | 12 Sep 2016 5:30 PM GMT''ఈ సినిమా మేం కొన్నప్పుడు చాలా హై ప్రైస్ (రేటు).. చాలా ఎక్కువ పెట్టాం.. కాకపోతే మొదటి వీక్ ఇలా డబ్బులు వచ్చేయడం అనేదే మ్యాజిక్. అందుకు మేం ఎన్టీఆర్ తో పాటు.. కొరటాల శివ గారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాం'' అంటూ మొన్న సక్సెస్ మీట్లో వ్యాఖ్యానించాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు. జనతా గ్యారేజ్ సినిమా నైజాం రైట్స్ ఆయనే కొనుక్కున్నారు. ఇప్పుడు దీని గురించి ట్రేడ్ సర్కిల్స్ లో డిస్కషన్లు బయలుదేరాయి.
వాస్తవానికి సినిమా ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఫైనల్ కలక్షన్ ఏదైతే ఉంటుందో అదే ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ వసూలు అవుతుంది. ఇప్పటికే 10 రోజుల్లో సినిమాకు దాదాపు 67.5 కోట్ల 'షేర్' వచ్చింది. మొత్తంగా 70+ కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సినిమా కథ ముగుస్తుంది. కాని బిజినెస్ వర్గాల పాయింటాఫ్ వ్యూ నుండి చూస్తే.. పంపిణీదారులకు మాత్రం పెద్ద లాభాలు ఏమీ రావు. అన్ని చోట్లా 20 నుండి 30 లక్షల ప్రాఫిట్ వస్తే.. బాగా వచ్చినట్లే లెక్క. హాలిడే సీజన్ లో కనిపించిన ఊపు.. వీక్ డేస్ లో తగ్గింది. పైగా టాక్ కూడా ఎబోవ్ యావరేజ్ గానే ఉండటంతో.. 70 కోట్లకు మించి కలక్షన్లు రావేమో. ఆ లెక్కన చూస్తే.. 67.5 కోట్లకు కొన్న సినిమా కేవలం 3-5 కోట్లు ప్రాఫిట్ వసూలు చేస్తే అది పంపిణీదారులకు ప్లస్ అవ్వదు. ఒక ప్రక్కన పెళ్లిచూపులు వంటి చిన్న సినిమాలు.. 1.5 కోట్లకు చేతికొచ్చాక 10 కోట్ల 'షేర్' వసూలు చేస్తుంటే.. (అందులో షుమారు 4 కోట్లు పంపిణీదారులకు.. 6 కోట్లు నిర్మాతలకు వాటాలే)ఈ పెద్ద సినిమాలు ఇలా తక్కువ లాభాలు గడిస్తే ఎలా? అనేదే ట్రేడ్ వర్గాల పాయింట్.
అయితే జనతా గ్యారేజ్ సినిమా నిర్మాతలకు మాత్రం భారీ ప్రాఫిట్ వచ్చేసినట్లే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. హీరో ఎన్టీఆర్ డైరక్టర్ కొరటాలకు ఏ రేంజ్ భారీ పేమెంట్ ఇచ్చినా కూడా.. సినిమా మొత్తంగా 40 కోట్లలో ఫినిష్ అయ్యుంటుందని ఒక అంచనా. అలా చూసుకుంటే వారికి రిలీజ్ కు ముందే విపరీతమైన ప్రాఫిట్లు అనమాట. అందుకే దిల్ రాజు.. ''ఈ సినిమాను చాలా హై ప్రైస్'' పెట్టి కొన్నాం అని స్ర్టెస్ చేసి ఉంటారు. కాకపోతే 2 కోట్లు పెట్టి ఒక ఏరియా కొన్ని పంపిణీదారుడికి.. కేవలం 15 రోజుల్లో 10 లక్షలు ప్రాఫిట్ వస్తోంది కదా. అలా చూస్తే లాభమే కదా అంటున్నారు విశ్లేషకులు.