Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోయిన్ అక్కడ ఓటీటీకే పరిమితం!

By:  Tupaki Desk   |   21 Jun 2023 10:08 PM IST
ఎన్టీఆర్ హీరోయిన్ అక్కడ ఓటీటీకే పరిమితం!
X
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈమె ఒక్క సినిమా తో కూడా కమర్షియల్‌ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది. హిందీలో ఈమె నటించిన సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ కంటే కూడా అధికంగా డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇప్పటికే గుంజన్ సక్సేనా.. ఘోస్ట్‌ స్టోరీస్‌ మరియు గుడ్ లక్ జెర్రీ సినిమాలు నేరు గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఇప్పుడు జాన్వీ కపూర్‌ కొత్త 'బవాల్‌' కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నేరుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు అంత సేఫ్ కాదని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారట. అందుకే బవాల్ సినిమా ను కూడా నేరుగా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయాల ని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేసిన జాన్వీ కపూర్‌ కు బవాల్ చిత్రం ఏడవది అనే విషయం తెల్సిందే. బవాల్‌ సినిమా లో వరుణ్ దావన్ హీరో గా నటించాడు. నితేష్‌ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అమెజాన్‌ ప్రైమ్ ద్వారా ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల దేశాల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ సినిమాలు ఓటీటీ కే పరిమితం అవుతున్నాయి. మరో వైపు ఈ అమ్మడు టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకున్నా కూడా టాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి 'దేవర' సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.